Andhra Pradesh: ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి.. టీడీపీపై మంత్రి అమర్ నాథ్ ఫైర్

| Edited By: Ravi Kiran

Aug 17, 2022 | 3:40 PM

ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిని చూసి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని..

Andhra Pradesh: ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయి.. టీడీపీపై మంత్రి అమర్ నాథ్ ఫైర్
Gudivada Amarnath
Follow us on

Andhra Pradesh: ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిని చూసి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నో కంపెనీలు ముందుకొస్తున్నాయన్నారు. తాము ఏం చేసినా టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందన్నారు. రాష్ట్రంలో చిన్న పరిశ్రమలు చేయూతనిస్తున్నామని.. గత 3ఏళ్ల కాలంలో సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఇన్సెంటివ్ లను ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ పెట్టినా స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలనే దానికి కట్టుబడి ఉన్నామన్నారు. కంపెనీ ప్రతినిధులకు సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈవిషయాన్ని స్పష్టం చేశారన్నారు. పరిశ్రమలను తీసుకొచ్చేది రాష్ట్రానికి ఆదాయంతో పాటు.. స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించేందుకేనని పేర్కొన్నారు.

తమ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పెట్టడానికి భూములు ఇచ్చి, అనుమతులు ఇచ్చి. పెట్టుబడులు తీసుకొస్తుంటే.. అదంతా తమ ఘనతగా టీడీపీ ప్రచారం చేసుకుంటుందని మంత్రి ఆరోపించారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తూ.. సుపరిపాలన అందిస్తున్నారన్నారు. ఎలాగైనా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసి.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ కల నెరవేరదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నతంకాలం టీడీపీకి అధికారం అనేది అందని ద్రాక్ష అని రాజకీయ విమర్శలు చేశారు. వార్డు సభ్యునిగా గెలవలేని నారా లోకేశ్, సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్.భారతిల గురించి అవాకులు, చవాకులు పేలడం మానుకోవాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..

ఇవి కూడా చదవండి