Vangalapudi Anitha: కార్యకర్త కోసం అర్థరాత్రి ఆస్పత్రికి పరిగెత్తిన హోమ్ మంత్రి అనిత.. అసలు ఏం జరిగిందంటే?

రాత్రి, పగలనే తేడా లేదు.. కార్యకర్తకు కష్టం వస్తే ఏక్షణమైనా నాయకులు అండగా ఉంటారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మరోసారి నిరూపించారు. అనారోగ్యంతో బాధపడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్నానని.. కార్యకర్త నుంచి వచ్చిన ఒక్క ఫోన్‌ కాల్‌.. ఆమెరు అర్థరాత్రి హాస్పిటల్‌కు చేర్చింది. కష్టాల్లో ఉన్నాననమ్మా.. కాపాడంటూ కార్యకర్త మాటలు ఆమెను చలించిపోయేలా చేశారు. అది అర్థరాత్రి అయినా వెంటనే హాస్పిటల్‌కు చేరుకొని కార్యకర్తను పరామర్శించారు హోంమంత్రి అనిత.. అతనికి ధైర్యం చెప్పి భరోసానిచ్చారు.

Vangalapudi Anitha: కార్యకర్త కోసం అర్థరాత్రి ఆస్పత్రికి పరిగెత్తిన హోమ్ మంత్రి అనిత.. అసలు ఏం జరిగిందంటే?
Ap Home Minister

Edited By:

Updated on: Jan 05, 2026 | 10:47 AM

సాధారణ ప్రజలకైనా విశ్రాంతి కోసం తీరిక ఉంటుందేమో కానీ.. ప్రజాప్రతినిధులకు మాత్రం ఆ అవకాశం ఉండదు. అధికార కార్రమాలని, గ్రామాల సందర్శన అని ఇలా ఎప్పుడూ ఏదో ఒక ప్రోగ్రామ్‌ ఉంటూనే ఉంటుంది. వాళ్లకు కాస్తా ఫ్రీగా ఉండే రోజు ఏదైనా ఉందంటే.. అది ఆదివారం.. ఇక ఆరోజూ కూడా ఏవైనా ప్రోగ్రామ్స్ ఉంటే వాళ్లు వెళ్లక తప్పదు.. ఇలానే జనవరి 4, ఆదివారం రోజూ ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనిత వివిధ కార్యక్రమాల్లో పాల్గొని రాత్రి 10 గంటల తర్వాత ఇంటికి చేరుకున్నారు. ఇప్పుడైనా కాస్త రిఫ్రెష్ అవుదామనుకునేలోపే ఆమె ఫోన్ మోగింది. ఆఫోన్ చేసిన వ్యక్తి మాట్లాడుతూ.. అమ్మ నేను హాస్పిటల్‌లో ఉన్నా.. అనారోగ్యంతో బాధపడుతున్నా.. నాకు భయంగా ఉందని చెప్పగానే ఆమె చలించి పోయారు. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఓ ఐటీడీపీ కార్యకర్త దమ్ము రాజు అని తెలుసుకొని వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

సొంత బిడ్డ తల్లిని పిలిచినట్టే అనిపించింది.

ఆ కాల్‌లో కార్యకర్త మాటలు వినగానే తన సొంత బిడ్డే తనకు బాధను చెప్పినట్టు ఆమెకు అనిపించింది. నీరసించి ఉన్నా వెంటనే హాస్పిటల్ కు వెళ్లాలని నిర్ణయించుకుంది. తనుతో పాటు తిరిగి సెక్యూరిటీ కూడా అలసిపోయారని.. వాళ్లను ఇబ్బంది పెట్టడం ఎందుకని, తానే స్వయంగా హాస్పిటల్‌కు వెళ్లి కార్యకర్త రాజుకి ధైర్యం చెప్పి రావాలనుకుంది. కానీ సిబ్బంది అందుకు ఒప్పుకోలేదు.. దీంతో సిబ్బందితో కలిసి హోమ్ మంత్రి అనిత నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న దమ్ము రాజును పరామర్శించారు. అతనితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ఆ సమయంలో అక్కడ ఉన్నవాళ్లకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఇది కేవలం ఒక మంత్రి పరామర్శ కాదు. ఒక కార్యకర్తపై నాయకురాలి నమ్మకం. ఇది పార్టీ–కార్యకర్త మధ్య ఉన్న బంధం అనుకన్నారు. టీడీపీలో ఒక పార్టీ కార్యకర్తకు నాయకులు ఎంతటి విలువ ఇస్తారో తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు చెబుతున్న ‘కార్యకర్తే పార్టీ బలం’ అనే మాటకు ఈ సంఘటనే నిలువెత్తు నిదర్శనం అనుకున్నారు.

ఆ సమయంలో కార్యకర్తల ఆరోగ్యం పట్ల మంత్రి చూపిన చొరవ ప్రస్తుతం పాయకరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కార్యకర్తకు కష్టం వస్తే అండగా నిలిచేందుకు హోంమంత్రి ఉన్నారని అందరికీ అర్థం అయింది. రాజకీయాల్లో అధికారమే కాదు.. త్మీయతే అసలైన బలం అని ఈ ఒక్క సంఘటన మళ్లీ రుజువుచేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి.