Visakhapatnam: అక్రమ నిర్మాణాలపై ఎందుకింత అలక్ష్యం?.. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వండి.. విశాఖ కలెక్టర్‌ను ఆదేశించిన హైకోర్టు..

|

Dec 31, 2021 | 8:56 AM

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు వివరణ ఇవ్వాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది

Visakhapatnam: అక్రమ నిర్మాణాలపై ఎందుకింత అలక్ష్యం?.. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వండి.. విశాఖ కలెక్టర్‌ను ఆదేశించిన హైకోర్టు..
Follow us on

ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు వివరణ ఇవ్వాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. జనవరి 3వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని తెలిపింది. విశాఖపట్నం జిల్లా సబ్బవరం గ్రామ పరిధిలోని సర్కారు భూమిలో దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగి వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన ధర్మాసనం ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించింది. అయితే అక్రమ నిర్మాణాలు ఆగడం లేదంటూ వెంకటేశ్వర్లు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో ఫిటిషన్‌ దాఖలు చేశాడు. ఇది గురువారం విచారణకు వచ్చింది.

ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎన్ హెచ్. అక్బర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాల విషయంలో ఎందుకు అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్‌ను ప్రశ్నించింది. ఈమేరకు వ్యక్తిగతంగా జనవరి 3 న హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కాగా కోర్టు ఆదేశాలు అమలులో నిర్లక్ష్యం వహించినట్లు తేలితే కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపడతామని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Also Read:

Pradeep Machiraju: అందుకే.. మీకు ఫ్యాన్‌ అయ్యామంటూ యాంకర్‌ ప్రదీప్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం.. కారణమేంటంటే..

Viral Video: నీదేం టేస్టురా బాబూ.. మ్యాగీపై మండిపడుతున్న ఆహార ప్రియులు.. కారణమేంటంటే..

Year Ender 2021: కరోనా కాలంలో కొరియన్‌ వంటకాలకు పెరిగిన క్రేజ్‌.. ఈ ఏడాది భారతీయులు ఎక్కువగా ఆర్డర్‌ చేసిన ఆహార పదార్థాలేంటంటే..