Ippatam Demolitions: ఇప్పటం కూల్చివేతలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషనర్లకు రూ.లక్ష చొప్పున జరిమానా..

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతలపై ఏపీలో రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధిత రైతులు హైకోర్టును కూడా ఆశ్రయించారు.

Ippatam Demolitions: ఇప్పటం కూల్చివేతలపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషనర్లకు రూ.లక్ష చొప్పున జరిమానా..
Ap High Court On Ippatam

Updated on: Nov 24, 2022 | 1:17 PM

AP High Court on Ippatam Demolitions: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ఇళ్ల కూల్చివేతలపై ఏపీలో రాజకీయాలు వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాధిత రైతులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. 14 మంది రైతులు పిటీషన్లను దాఖలు చేశారు. వారందరికీ.. ఏపీ హైకోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఇప్పటంలో కూల్చివేతల కేసును గురువారం విచారించిన ఏపీ హైకోర్టు పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తంచేసింది. కోర్టును పక్కదారి పట్టించారంటూ ఈ సందర్భంగా ఇప్పటం పిటిషనర్లకు జరిమానా విధించింది. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున 14 మందికి జరిమానా విధిస్తూ ఉత్తర్వులు చేసింది. ఆక్రమణల కూల్చివేతలకు ముందే నోటీసులు ఇచ్చినా.. ఇవ్వలేదంటూ పిటిషనర్లు కోర్టును తప్పుదోవ పట్టించారని ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది.

దీనిపై కూల్చివేతలపై గతంలో స్టే ఇచ్చిన కోర్టు.. తాజాగా.. విచారణ చేపట్టింది. ఇళ్ల కూల్చివేతల విషయంలో ప్రభుత్వం తమకు నోటీసులు ఇవ్వలేదంటూ పిటీషనర్లు హైకోర్టుకు వివరించారు. అయితే.. తాము నోటీసులు ఇచ్చిన తర్వాతే కూల్చివేసినట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. దీంతో హైకోర్టు పిటీషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

కోర్టును పక్కదారి పట్టించారని ఈ సందర్భంగా ధర్మాసనం మండిపడింది. ఆక్రమణల కూల్చివేతలకు ముందే నోటీసులు ఇచ్చినా ఇవ్వలేదంటూ కోర్టును తప్పుదోవ పట్టించారని పేర్కొంది. నోటీసులు ఇచ్చారని రుజువు కావడంతో హైకోర్టు వారికి జరిమానా విధించడంతోపాటు పిటీషన్‌ను కొట్టివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..