
అమరావతి(Amaravati) రైతులు ఫైల్ చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై ఏపీ హైకోర్టు(ap high court) గురువారం విచారణ జరిపింది. మార్చి 3న అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తుది తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు అమరావతి రాజధాని పనుల పురోగతిపై వాస్తవాలు తెలుసుకునేందుకు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగానే కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని, నిధులు లేవనే సాకు చెబుతోందని కోర్టుకు చెప్పారు రైతుల తరఫు లాయర్.
అమరావతిని రాజధానిగా అభివృద్ధిగా చేయాలని, మూడు నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు కేటాయించాలని మార్చిలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆరు నెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, మాస్టర్ ప్లాన్‌లో ఉన్నది ఉన్నట్టు అమలు చేయాలని కూడా ఆదేశించింది. సీఆర్‌డీఏ చట్టం రద్దు కుదరదని స్పష్టం చేసింది. మూడు రాజధానుల బిల్లును కొట్టేసింది. అయితే హైకోర్టు జడ్జిమెంట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ పెట్టింది. ఆ తీర్పును అమలు చేయడం కష్టమంటూ అఫిడవిట్ దాఖలు చేసింది.
హైకోర్టు తుది తీర్పు ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా అమరావతిలో ప్రభుత్వం ఏం చేసిందో హైకోర్టుకు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాల్సి వుంటుంది. తీర్పు వచ్చి రెండు నెలలు దాటింది. ఇచ్చిన గడువు ఆరు నెలలు. కానీ తీర్పును అమలు చేయాలంటే కోట్లాది రూపాయలు కావాలని ప్రభుత్వం అంటోంది. దీంతో కోర్టుకు ఇప్పుడు ప్రభుత్వం ఏం చెబుతుందనే అంశం ఇంట్రెస్టింగ్‌గా మారింది. రైతులు వేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు జూలై 12కు వాయిదా వేసింది.
ఏపీ వార్తల కోసం..
ఇవి కూడా చదవండి: PK Mission: కొత్త పార్టీ పెట్టడం లేదు.. పాదయాత్ర చేస్తాను.. ఆయన పాలనపై పీకే కీలక వ్యాఖ్యలు..
ఉత్కంఠ పోరులో వైసీపీకే దుగ్గిరాల ఎంపీపీ పీఠం.. వ్యూహాత్మకంగా గెలిచిన రూపవాణి..