Andhra Pradesh: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్… త్వరలోనే ఆ పోస్టులు భర్తీ

|

Dec 11, 2021 | 6:29 PM

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు  సురేష్ కామెంట్స్ కీలక కామెంట్స్ చేశారు.  అన్ని శాఖలలో బ్యాక్‌లాగ్‌ పోస్టులు  భర్తీ చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.

Andhra Pradesh: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్... త్వరలోనే ఆ పోస్టులు భర్తీ
Ap Govt
Follow us on

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కామెంట్స్ కీలక కామెంట్స్ చేశారు.  అన్ని శాఖలలో బ్యాక్‌లాగ్‌ పోస్టులు  భర్తీ చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. త్వర‌లోనే పెద్ద సంఖ్యలో బ్యాక్‌లాగ్‌ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేశారు ఆదిమూల‌పు. సీఎం జగన్ నాయకత్వంలో ఇప్పటికే ఒక జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసినట్లు గుర్తు చేశారు. విద్యాశాఖకు సంబంధించి ఈమధ్య రెండు చట్టాలను కూడా తీసుకువచ్చినట్లు చెప్పారు.  ఎస్సీ, ఎస్టీ రోస్టర్ పాయింట్లలో యూనిట్ ఆఫ్ రిజర్వేషన్‌ను సరిదిద్దుతూ చట్టాలు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల అమలులో ఎక్కడైనా అధికారులు నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం కోర్టు కేసులు సాకుగా చూపించి.. బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయకపోగా, ప్రమోషన్లు నిలుపుదల చేసిందని ఆరోపించారు.

ఈ ప్రభుత్వం స్వయంప్రతిపత్తి అధికారాలు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ కమిషన్ లను ఏర్పాటు చేసిందని చెప్పారు. వారు ఎదైనా రిపోర్టు ఇస్తే తూచ తప్పకుండా ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. SC, ST కమీషన్లు గతంలో ఒక పార్టీకి కొమ్ము కాయట౦ చూసామని.. కానీ జగన్ సర్కార్ అన్ని విషయాల్లో రిజర్వేషన్ అమలు చేసేందుకు సిద్దంగా ఉందని స్పష్టం చేశఆరు. లోకల్ పోస్టుల భర్తీలో కూడా ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని సీఎం చెప్పారని ఆదిమూలపు గుర్తుచేవారు. ఎస్సీ. ఎస్టీ నిధులు పక్కదారి పడుతున్నాయని ప్రతిపక్షాలు విషపూరిత ప్రచారం చేస్తున్నాయని..   ఏ సంక్షేమ పథకం తీసుకున్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు 80 శాతం మంది ఉన్నారని ఆదిమూలపు చెప్పారు. దాని మీద చర్చకు కూడా తాను సిద్దమన్నారు. ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటేడ్ అధికారులు సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని…రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేస్తోందని వెల్ల‌డించారు. ఎస్సీ.. ఉప కులాల మధ్య TDP గతంలో రాజకీయ లబ్ధికోసం మాల, మాదిగలని చిచ్చు పెట్టిందని పేర్కొన్నారు. SC, ST ఉద్యోగులు ఏదైనా వివక్ష ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు వస్తే కచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా విద్యాశాఖలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Also Read: Andhra Pradesh: రైతు గుండె మండింది.. చెమటోడ్చి పండించిన పంటకు నిప్పుపెట్టాడు

ఆశ్చర్యం.. ఏపీలో పెరిగిన మునక్కాడల ధర.. కేజీ ఏకంగా రూ.600