
కర్నూలు, జులై 20: జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులు.. విధి నిర్వహణలో మృతి చెందితే.. వారి స్థానంలో అర్హత కలిగిన కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద సచివాలయ శాఖలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో సచివాలయాలలోని అన్ని శాఖలకు సంబంధించి అర్హత ఉండి దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈనెల 21న ఉదయం 10 గంటలకు జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కలెక్టర్ సృజన వెల్లడించారు అభ్యర్థులు తమ విద్యార్హత కులం ఇతర అవసరమైన ధ్రువపత్రాలతో డీఆర్ఓ కార్యాలయంలో హాజరు కావాలని ఆమె సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.