AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు అద్భుత అవకాశం.. అది పూర్తిగా ఉచితం..

ఏపీలోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు తీపికబురు. ప్రభుత్వ విద్యాసంస్ధల్లో ప్రత్యేక ఆధార్ కేంద్రాలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఉచితంగా విద్యార్థులు ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయించుకోవచ్చు. దీంతో తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

Andhra Pradesh: ఏపీలోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు అద్భుత అవకాశం.. అది పూర్తిగా ఉచితం..
Schools
Venkatrao Lella
|

Updated on: Feb 04, 2026 | 1:58 PM

Share

ఏపీలోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో స్పెషల్ ఆధార్ క్యాంపులను ప్రతీ నెలా నిర్వహిస్తోంది. ప్రతీ నెల ప్రారంభంలో అన్ని గవర్నమెంట్ విద్యాసంస్థల్లో వీటిని ఏర్పాటు చేస్తోంది. గత కొద్ది నెలలుగా వీటిని ఏర్పాటు చేస్తోండగా.. ఫిబ్రవరిలో కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా పిల్లలు, కాలేజీ విద్యార్థులు ఉచితంగా ఆధార్ కార్డుల్లోని బయోమెట్రిక్, ఇతర వివరాలను అప్డేట్ చేయించుకోవచ్చు. ఇందుకోసం గ్రామం నుంచి పట్టణాల్లో ఉండే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లకు వెళ్లాల్సిన వ్యయప్రయాసాలు తప్పుతాయి. ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లలో ఆధార్ అప్డేట్‌కు ఛార్జీలు వసూలు చేస్తారు. కానీ ఈ స్పెషల్ క్యాంపుల్లో ఉచితంగానే సేవలు అందిస్తారు.

ఫిబ్రవరిలో ఎప్పుడంటే..?

ఈ నెల 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఆధార్ స్పెషల్ క్యాంపులను స్కూళ్లు, కాలేజీల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. అలాగే ఫిబ్రవరి 16 నుంచి 20వ తేదీ వరకు కూడా మళ్లీ నిర్వహించనుంది. పిల్లలు చిన్న వయస్సులో ఆధార్ తీసుకుంటారు. దీంతో పెద్దయ్యాక బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో చాలామంది విద్యార్థులు ఇంకా అప్డేట్ చేసుకోలేదు. దీంతో ప్రభుత్వం ఈ ప్రత్యేక ఆధార్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తోంది. గ్రామ, వార్డు సచివాలయం సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా వీటిని నిర్వహిస్తున్నారు. 5 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ఆధార్ అప్డేట్ చేయించుకుంటే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. దీంతో తల్లిదండ్రులు ఈ అవకాశం ఉపయోగించుకుని పిల్లల ఆధార్ వివరాలను అప్డేట్ చేయించాలని అధికారులు తన ప్రకటనలో తెలిపారు.

తెలంగాణలో కూడా స్పెషల్ క్యాంపులు

గత ఏడాది అక్టోబర్ నుంచి ఏపీలోని విద్యాసంస్థల్లో ఈ ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. అయినా కొంతమంది తల్లిదండ్రుల తమ పిల్లల ఆధార్ వివరాలను అప్డేట్ చేయించడం లేదు. దీంతో ప్రభుత్వం వీటిని ప్రతీ నెలా కొనసాగిస్తూ వస్తోంది. పిల్లల ఆధార్ వివరాలు అప్డేట్ చేయిచంకపోతే వినియోగించే సమయంలో సమస్యలు రావొచ్చు. ప్రభుత్వ పథకాలు, ఇతర బెనిఫిట్స్ ఆగిపోయే అవకాశముంది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాంటి స్పెషల్ ఆధార్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఎంఈవోలను సంప్రదించి ఈ సెంటర్ల వివరాలను పొందవచ్చు. కాగా చిన్నతనంలో ఆధార్ తీసుకునే సమయంలో తీసుకున్న బయోమెట్రిక్ వివరాలు తర్వాత పనిచేయవు. దీంతో పెద్ద అయ్యాక వాటిని అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనిని యూఐడీఏఐ తప్పనిసరి చేసింది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది.

Follow Us
బెట్టింగ్ వ్యసనం ఇతడిని దొంగగా మార్చింది..
బెట్టింగ్ వ్యసనం ఇతడిని దొంగగా మార్చింది..
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ నుంచి అప్డేట్.
భారత్‌లో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఆర్బీఐ నుంచి అప్డేట్.
ఈ మూగజీవాల ప్రేమకు సలాం కొట్టాల్సిందే.. ఏనుగునే ఎదురించి యజమానిని
ఈ మూగజీవాల ప్రేమకు సలాం కొట్టాల్సిందే.. ఏనుగునే ఎదురించి యజమానిని
పచ్చని తోటల్లో మత్తు భూతం..పాఠశాల పరిసరాల్లో గుట్టలుగా నార్కోటిక్
పచ్చని తోటల్లో మత్తు భూతం..పాఠశాల పరిసరాల్లో గుట్టలుగా నార్కోటిక్
పడుకుందామని దోమ తెరపట్టుకుంటే.. కాలికి మెత్తగా తగిలింది.. వామ్మో
పడుకుందామని దోమ తెరపట్టుకుంటే.. కాలికి మెత్తగా తగిలింది.. వామ్మో
ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
ఒకేసారి ఐదు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే
మీ అదృష్టాన్ని మార్చే మొక్క.. పూజిస్తే కోటీశ్వరులే
బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..
బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే చాలు..
బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది..సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే
బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది..సీతమ్మ పువ్వు ఇలా పెంచితే తోటంతా పూలే
జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..
జెన్ జీకి దగ్గరయ్యేందుకు జనసేన కీలక నిర్ణయం..