Black Fungus Treatment: బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి చేరుస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై ఇటీవలే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కావడంతో ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. కాగా, ఇప్పటికే కరోనా చికిత్సను ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పధకం కింద అందిస్తోన్న విషయం విదితమే. ఇదిలా ఉంటే ఏపీలో ఇప్పటివరకు తొమ్మిది బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 3, కర్నూలులో 2, అనంతపురంలో 2, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 1 చొప్పున కేసులు వెలుగుచూశాయి.
Also Read:
ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ టైమింగ్ మారిందా.? ఇందులో నిజమెంత.!
ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు సింహం దాగి ఉంది.. ఎక్కడ ఉందో గుర్తుపట్టండి చూద్దాం.!