ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్.. మరింత విస్తరించనున్న “అమృత ఆరోగ్య పథకం”
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనాథలు, నిరాశ్రయులు, వృద్ధుల కోసం అమలు చేసే “అమృత ఆరోగ్య పథకం” విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,812 మందికి అమృత ఆరోగ్య పథకం వర్తింపజేస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనాథలు, నిరాశ్రయులు, వృద్ధుల కోసం అమలు చేసే “అమృత ఆరోగ్య పథకం” విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,812 మందికి అమృత ఆరోగ్య పథకం వర్తింపజేస్తోంది. అదనంగా 1,113 మంది అనాథలు, నిరాశ్రయులు, వృద్ధులకు అమృత ఆరోగ్య పథకం వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య కార్యదర్శి సారభ్ గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవోకు సూచించారు.
ప్రస్తుతం ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 2,812 మంది ఉన్నారు గుర్తించిన వారందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్యసేవలు అందనున్నాయి. అమృత ఆరోగ్య పథకం కింద 1,044 థెరపీలు , సర్జరీలు సహా ఏడాదికి రూ. 2.50 లక్షల వరకు ఉచిత వైద్య సాయం అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో అనాథలు, నిరాశ్రయులైన వారికి, వృద్ధులకు “అమృత ఆరోగ్య పథకం” ద్వారా మరిన్ని వైద్య సేవలు దక్కనున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




