Jagan: రాష్ట్రంలో భయానక వాతావరణం ఏర్పడింది.. గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి: జగన్‌ ట్వీట్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని.. రాష్ట్రంలో భయానక వాతావరణం ఏర్పడిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని.. గవర్నర్‌ జోక్యం చేసుకుని అరాచకాలు ఆపాలి.. అంటూ జగన్‌ కోరారు.. ఈ మేరకు జగన్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

Jagan: రాష్ట్రంలో భయానక వాతావరణం ఏర్పడింది.. గవర్నర్‌ జోక్యం చేసుకోవాలి: జగన్‌ ట్వీట్‌
Jagan

Updated on: Jun 06, 2024 | 3:42 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని.. రాష్ట్రంలో భయానక వాతావరణం ఏర్పడిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని.. గవర్నర్‌ జోక్యం చేసుకుని అరాచకాలు ఆపాలి.. అంటూ జగన్‌ కోరారు.. ఈ మేరకు జగన్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ప్రమాణస్వీకారానికి ముందే ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారంటూ జగన్‌ పేర్కొన్నారు. ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. గవర్నర్‌.. వెంటనే జోక్యం చేసుకుని అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేశారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు.

‘‘రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్‌.. వెంటనే జోక్యం చేసుకుని అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం’’.. – జగన్‌

గవర్నర్ ను కలవనున్న వైసీపీ నేతలు..

ఇదిలాఉంటే.. ఈరోజు సాయంత్రం వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్ ను కలవనున్నారు. కౌంటింగ్ తర్వాత దాడుల పై  వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయనుంది.

కాగా.. జగన్‌.. వైసీపీ నేతలతో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓటమి, టీడీపీ దాడులు, పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది..

తీర్పును గౌరవిస్తామన్నాం..

ఏపీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామన్నామని.. వైసీపీ నాయకురాలు ఉషశ్రీ చరణ్‌ పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌తో భేటీ తర్వాత బయటకొచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఓటమిపై సమీక్ష, టీడీపీ దాడులపై చర్చించినట్లు తెలిపారు. కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజా కోర్టులో నిలదీస్తామన్నారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని ఉషశ్రీ హెచ్చరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..