AP SA-2 Revised Timings: ఏపీ విద్యార్ధులకు అలర్ట్‌.. పరీక్షల సమయంలో మార్పు చేసిన విద్యాశాఖ

|

Apr 18, 2023 | 2:53 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు హడలెత్తిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఏపీలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచే..

AP SA-2 Revised Timings: ఏపీ విద్యార్ధులకు అలర్ట్‌.. పరీక్షల సమయంలో మార్పు చేసిన విద్యాశాఖ
AP SA-2 Timings
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు హడలెత్తిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో జనం ఇళ్ల నుంచి బయటికి రావడానికి బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఏపీలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఉదయం 8 గంటల నుంచే బానుడి ప్రతాపం తీవ్ర స్థాయిలో కొననసాగుతోంది. ఇక పెరిగిన ఎండల దృష్ట్యా ఏపీ సర్కార్ ఇప్పటికే స్కూళ్లకు ఒంటి పూట బడులు ప్రకటించింది కూడా. ఐతే విద్యార్ధులకు సమ్మెటివ్‌-2 పరీక్షలు సమీపించడంతో ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షల సమయాలను మార్పు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతుల వరకు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తొమ్మిదో తరగతికి ఉదయం 8 గంటల నుంచి 11.15 గంటల వరకు పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ సూచించింది. పరీక్షల అనంతరం మధ్యాహ్న భోజనం పెట్టి, విద్యార్థులను ఇళ్లకు పంపిచేలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.