
ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2023 హాల్ టికెట్లను జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ సోమవారం (జూన్ 12) విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవల్సిందిగా సూచించింది. జూన్ 20వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈసెట్ పరీక్ష జరగనుంది.
కాగా ముందుగా ఇచ్చిన ప్రకటన ప్రకారం మే 5న ఏపీ ఈసెట్-2023 పరీక్ష జరగనుండగా.. పాలిటెక్నిక్ ఆఖరి సంవత్సరం పరీక్షలు పూర్తికాకపోవడంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఈ పరీక్షను వాయిదా వేసింది. దీంతో ఈ పరీక్షను జూన్ 20కు వాయిదా వేసినట్లు ఏపీ ఈసెట్ ఛైర్మన్ జీవీఆర్ ప్రసాదరాజు ప్రకటించారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (అనంతపూర్) పరిధిలో ఈ పరీక్షను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీ ఈసెట్-2023లో వచ్చిన ర్యాంకు ఆధారంగా బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సులకు సంబంధించి ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.