AP Eamcet Exams: ఏపీ ఎంసెట్ షెడ్యూల్.. ఆగష్టు 19 నుంచి 25 వరకు.. నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ పరీక్షలు ఆగష్టు 19 నుంచి ఆగష్టు 25 వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ వెల్లడించారు...

AP Eamcet Exams: ఏపీ ఎంసెట్ షెడ్యూల్.. ఆగష్టు 19 నుంచి 25 వరకు.. నోటిఫికేషన్ విడుదల

Updated on: Jun 24, 2021 | 5:25 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ పరీక్షలు ఆగష్టు 19 నుంచి ఆగష్టు 25 వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి ఒమర్ జలీల్ వెల్లడించారు. ఈ మేరకు నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణకు గతంలో సూచించిన తేదీలను సవరించి.. మరోసారి కొత్త తేదీలను ప్రకటించారు.

కొత్తగా విడుదలైన నోటిఫికేషన్ ప్రకారం, అపరాధ రుసుము లేకుండా జూన్ 30వ తేదీ వరకు ఎంసెట్ దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు. రూ. 5000 లేట్ ఫీజుతో జూలై 7 వరకు, రూ. 10 వేలు అపరాధ రుసుముతో జూలై 14 వరకు, రూ. 15 వేలు లేట్ ఫీజుతో జూలై 22 వరకు, రూ. 20 వేలు అపరాధ రుసుముతో జూలై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు. కరోనా నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతీ సెంటర్‌ను శానిటైజ్ చేస్తామని.. విద్యార్ధుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కాగా, ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మొదటి, రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉందని అన్నారు.

Also Read:

Viral Video: అందంతో చంపుతున్న సొట్టబుగ్గల సుందరి.. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో.!

Viral Video: ఆఫ్రికన్ పైథాన్‌తో తల్లి చిరుత ఫైట్.. అది చేసిన పనికి నెటిజన్లు సలామ్.. వైరల్ వీడియో!

సెహ్వాగ్, డివిలియర్స్ స్టైల్‌లో.. 17 బంతుల్లో 76 పరుగులు.. బౌలర్లకు చుక్కలే చుక్కలు!