AP Corona: ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా పాజిటివ్ కేసులు ఎన్నంటే.!
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో...
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,601 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 20,06,191 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 14,061 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 1,201 మంది వైరస్ నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 19,78,364కి చేరింది. అలాగే తాజాగా వైరస్ కారణంగా 16 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 13,766కి చేరింది.
మరోవైపు నిన్న జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం 26, చిత్తూరు 217, తూర్పుగోదావరి 273, గుంటూరు 123, కడప 108, కృష్ణ 116, కర్నూలు 10, నెల్లూరు 208, ప్రకాశం 124, శ్రీకాకుళం 37, విశాఖపట్నం 98, విజయనగరం 40, పశ్చిమ గోదావరి 221 కేసులు నమోదయ్యాయి.