AP Corona Cases: ఏపీలో తగ్గిన పాజిటివ్ కేసులు.. 98 శాతానికి చేరిన రికవరీలు.. వివరాలు

|

Jul 15, 2021 | 5:33 PM

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఒక రోజు పాజిటివ్ కేసులు తగ్గుతుంటే.. మరో రోజు ఆ సంఖ్య పెరుగుతోంది. తాజాగా...

AP Corona Cases: ఏపీలో తగ్గిన పాజిటివ్ కేసులు.. 98 శాతానికి చేరిన రికవరీలు.. వివరాలు
Coronavirus Cases In AP
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఒక రోజు పాజిటివ్ కేసులు తగ్గుతుంటే.. మరో రోజు ఆ సంఖ్య పెరుగుతోంది. తాజాగా రోజూవారి నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 93,785 శాంపిల్స్ పరీక్షించగా.. 2,526 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 19,32,105కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 25,526 ఉండగా.. 18,93,498 మంది వైరస్ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇదిలా ఉంటే నిన్న 2933 మంది రికవరీ కాగా, 24 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. దీనితో ఇప్పటిదాకా కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,081కి చేరుకుంది. గత 24 గంటల్లో అత్యధిక మరణాలు ప్రకాశం(6) జిల్లాలో సంభవించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేట్ 2.7 శాతంగా ఉండగా.. రికవరీ శాతం 98కి చేరింది. జిల్లాల వారీగా నమోదైన కేసులు.. అనంతపురం 80, చిత్తూరు 391, తూర్పుగోదావరి 404, గుంటూరు 178, కడప 157, కృష్ణ 269, కర్నూలు 35, నెల్లూరు 210, ప్రకాశం 308, శ్రీకాకుళం 91, విశాఖపట్నం 119, విజయనగరం 49, పశ్చిమ గోదావరి 235 కేసులు నమోదయ్యాయి.

కాగా, ఇవాళ్టి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు ప్రకటించింది. దీనితో ప్రజలందరూ కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఏపీ కోవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లొద్దని.. ఒకవేళ వెళ్తే మాస్క్ పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం మర్చిపోవద్దని సూచించారు.

Also Read:

పాపం మొసలి.! కొండచిలువ తలను కొరికింది.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది.. వైరల్ వీడియో!

ఈ ఫోటోలో మంచు చిరుత దాగుంది.. అదెక్కడ ఉందో గుర్తించండి.! మెదడుకు పదును పెట్టండి!