AP Corona Cases: ఏపీలో గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు, మరణాలు.. కొత్తగా ఎన్నంటే.!

|

Jul 13, 2021 | 5:21 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 81,763 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 2,567 పాజిటివ్ కేసులు..

AP Corona Cases: ఏపీలో గణనీయంగా తగ్గిన పాజిటివ్ కేసులు, మరణాలు.. కొత్తగా ఎన్నంటే.!
Coronavirus Cases In AP
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 81,763 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 2,567 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 19,26,988 కరోనా కేసులు నమోదు కాగా.. ఇందులో 26,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 3034 మంది వైరస్ నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 18,87,236కి చేరింది. అలాగే తాజాగా వైరస్ కారణంగా 18 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 13,042కి చేరింది.

మరోవైపు నిన్న జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం 81, చిత్తూరు 300, తూర్పుగోదావరి 356, గుంటూరు 269, కడప 75, కృష్ణ 269, కర్నూలు 18, నెల్లూరు 244, ప్రకాశం 351, శ్రీకాకుళం 77, విశాఖపట్నం 199, విజయనగరం 49, పశ్చిమ గోదావరి 279 కేసులు నమోదయ్యాయి.

ఏపీ కర్ఫ్యూ అంక్షల్లో సడలింపులు…

ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేలా కర్ఫ్యూ సడలింపులు అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చారు. ఇక రాత్రి 9 గంటల తర్వాత రాష్ట్రంలోని అన్ని దుకాణాలు మూసివేయాలని తెలిపారు. అలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కట్టుదిట్టమైన నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read:

ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!

కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

10 పరుగులిచ్చి 10 వికెట్లు.. అందులో ఓ హ్యాట్రిక్.. టెస్టుల్లో అరుదైన రికార్డు.. ఆ బౌలర్ ఎవరంటే.!

కళ్లను మాయ చేసే ఫోటో.. బల్లిని గుర్తించండి చూద్దాం.. అస్సలు ఫెయిల్ కాకూడదు.!