Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా.. ఇకపై కూడా అంటూ.. సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్

నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ..

CM Jagan: ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా.. ఇకపై కూడా అంటూ.. సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్
Cm Jagan
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 02, 2022 | 9:27 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం జగన్ నివాళులర్పించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి సీఎం జగన్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం.. వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా తన తండ్రిని తలుచుకుంటూ సీఎం జగన్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

అనంతరం విడతల వారీగా సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాల పై స్థానిక నాయకులు, అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం