Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ: లైవ్ లో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన అంబటి రాయుడు! పెద్ద దుమారమే రేపాడుగా..

ఐపీఎల్ 2025కు ముందే రాయుడు చేసిన RCBపై వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ సమయంలో సంజయ్ బంగర్ ఆర్‌సీబీపై ప్రశంసలు గుప్పించగా, రాయుడు తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. ఇది RCB అభిమానులను కోపానికి గురిచేయగా, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఐపీఎల్ 2025 సమీపిస్తున్న నేపథ్యంలో రాయుడు కామెంట్స్ మరింత హాట్ టాపిక్ కావడం ఖాయం!

IND vs NZ: లైవ్ లో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టిన అంబటి రాయుడు! పెద్ద దుమారమే రేపాడుగా..
Ambati Rayudu Comments Rcb
Follow us
Narsimha

|

Updated on: Mar 10, 2025 | 9:30 AM

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా రోజుల సమయం ఉన్నా, అప్పుడే ఈ టోర్నమెంట్‌పై హైప్ క్రియేట్ అవుతోంది. ఒకవైపు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరుగుతుండగా, మరోవైపు ఐపీఎల్ 2025పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేక జట్లు ప్రాక్టీస్ క్యాంప్‌లను ప్రారంభించాయి. అభిమానులను ఆకర్షించేందుకు తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కొత్త అప్‌డేట్‌లు ఇస్తున్నాయి. ఇకపోతే, ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌ల టికెట్ల విక్రయం కూడా మొదలైపోయింది.

ఈ నేపథ్యంలో, క్రికెట్ విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు కూడా తమ కామెంట్లతో ఐపీఎల్‌ 2025పై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఇండియా vs న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్లు అంబటి రాయుడు, సంజయ్ బంగర్ మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారింది.

అంబటి రాయుడు గతంలోనే ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుపై వివిధ సందర్భాల్లో విమర్శలు చేశారు. తాజాగా, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సమయంలో కామెంటరీలో సంజయ్ బంగర్ ఆర్‌సీబీపై ప్రశంసలు కురిపించాడు. గత నాలుగేళ్లుగా ఆర్‌సీబీ నిలకడగా ఆడి ప్లేఆఫ్స్‌కు చేరుకుంటోందని, ఇది గొప్ప పరిణామమని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే, వెంటనే అంబటి రాయుడు స్పందిస్తూ, “ఈ లెక్కన ఈసారి ఆర్‌సీబీ క్వాలిఫయర్-2 ఆడుతుందా?” అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశాడు.

ఈ వ్యాఖ్యలతో ఆర్‌సీబీ అభిమానులు అసహనం వ్యక్తం చేయగా, సంజయ్ బంగర్ కూడా రాయుడికి మళ్లీ జవాబు ఇచ్చే ప్రయత్నం చేశాడు. “ఆర్‌సీబీ అభిమానులు ఈ మ్యాచ్ చూస్తున్నారు, అదేం మర్చిపోవద్దు” అని రాయుడికి హితవు పలికాడు. అయితే, రాయుడు ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోకుండా, “అయితే ఏంటీ? నన్ను బెదిరిస్తున్నారా? ఏది ఏమైనా, ఆర్‌సీబీ అభిమానులు అంటే నాకు కూడా ప్రేమే” అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు.

ఇది తొలిసారి కాదనే చెప్పాలి. గతంలోనూ అంబటి రాయుడు ఆర్‌సీబీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఓ తెలుగు పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఐపీఎల్ ట్రోఫీని ఎవరూ గెలవకూడదనుకుంటే అది ఆర్‌సీబీయేనని, ఆ జట్టు టైటిల్ గెలవకపోవాలని కోరుకుంటానని చెప్పి వివాదానికి కారణమయ్యాడు.

గత సీజన్‌లో ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ అద్భుత ప్రదర్శన చేసి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఇది ఆర్‌సీబీ అభిమానులకు పెద్ద విజయంగా అనిపించగా, అంబటి రాయుడు మాత్రం ఆ జట్టు సంబరాలను వ్యంగ్యంగా విమర్శించాడు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడిగా రాయుడు ఆ జట్టు ఓటమిని తట్టుకోలేకపోయాడా? లేక నిజంగానే ఆర్‌సీబీపై అతనికి వ్యతిరేకత ఉందా? అనేది మళ్లీ చర్చనీయాంశమైంది.

ఏదేమైనా, అంబటి రాయుడు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. కొందరు ఆర్‌సీబీ అభిమానులు అతనిపై మండిపడగా, మరికొందరు మాత్రం ఇదంతా సరదాగా తీసుకున్నారు. ఐపీఎల్ 2025 సమీపిస్తున్న నేపథ్యంలో రాయుడు కామెంట్స్ ఇంకా చర్చనీయాంశం కావడం ఖాయం!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..