Krishna District: కొన్ని రోజులుగా ముభావంగా 9 ఏళ్ల బాలిక.. ఏమైందని పేరెంట్స్ అడగ్గా.. నిర్ఘాంతపోయే నిజం
మైనర్ బాలురు నీలిచిత్రాలు చూడటానికి అలవాటు పడ్డారు. అక్కడితో ఆగలేదు.. వాటిని చూపిస్తూ ఓ బాలికను వేధించడం మొదలెట్టారు.
Andhra Pradesh: కృష్ణాజిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆగిరిమల్లి మండలం(Agiripalli mandal) వడ్లమాను(Vadlamanu) గ్రామంలో నివశిస్తున్న ఓ బాలిక కొంతకాలంగా ముభావంగా ఉంటుంది. ఇంట్లో కూడా భయంభయంగా తిరుగుతుంది. ఏమైందా అని ఆరా తీయగా.. కుమార్తె చెప్పిన విషయం విని తల్లిదండ్రలు నిర్ఘాంతపోయారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన 9 ఏళ్ల బాలిక అదే ఊర్లో చదువుకుంటోంది. అయితే ఆ బాలిక నివశిస్తున్న ఇంటి ఓనర్ పుత్రరత్నంతో పాటు ఆ సమీప ప్రాంతంలో నివశించే మరో ఇద్దరు బాలురు ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూడ్డానికి అలవాటుపడ్డారు. ఈ క్రమంలో బాలికపై వారి కన్ను పడింది. ఆమెను ఇంటిపైకి తీసుకెళ్లి.. కొద్ది రోజులుగా పోర్న్ వీడియోలు చూపిస్తూ లైంగికంగా వేధిస్తున్నారు. విషయం ఎవరితోనైనా చెప్తే.. చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆ బాలిక ప్రవర్తనలో తేడా వచ్చింది. ఇంట్లో ఒంటరిగా కూర్చుంటుంది. చిన్న.. చిన్న విషయాలకు కూడా భయపడుతుంది. దీంతో అనుమానం వచ్చి పేరెంట్స్ గట్టిగా అడగ్గా.. బోరున విలపిస్తూ అసలు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఇంతలోనే పెద్ద మనుషులు రంగంలోకి దిగి.. రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం