Andhra Pradesh: ప్రేమించానని వివాహితకు వేధింపులు.. కిడ్నాప్ చేసి, పలుమార్లు అఘాయిత్యం.. చివరకు ఊహించని విధంగా
ప్రేమించిన యువతికి వేరొకరితో పెళ్లైంది. దీన్ని జీర్ణించుకలేని యువకుడు ఆమె ఎప్పుడెప్పుడు ఇంటి కొస్తుందా అని ఎదురు చూశాడు. తీరా ఆ రోజు రానే వచ్చింది. భర్తతో కలిసి పుట్టింటికి వచ్చిన యువతిని ప్రేమ పేరుతో మళ్లీ వేధించడం..
ప్రేమించిన యువతికి వేరొకరితో పెళ్లైంది. దీన్ని జీర్ణించుకలేని యువకుడు ఆమె ఎప్పుడెప్పుడు ఇంటి కొస్తుందా అని ఎదురు చూశాడు. తీరా ఆ రోజు రానే వచ్చింది. భర్తతో కలిసి పుట్టింటికి వచ్చిన యువతిని ప్రేమ పేరుతో మళ్లీ వేధించడం ప్రారంభించాడు. ఆమె ఒప్పుకోకపోయేసరికి కిడ్నాప్ చేశాడు. ఓ రూమ్ లో బంధించి, పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు బాధితురాలిని ఇంటి వద్ద దింపాడు. ఈ విషయాన్ని యువతి తన బంధువులకు చెప్పింది. వారు వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై పోలీసు కేసు నమోదవడంతో యువకుడు మనస్తాపానికి గురై సూసైడ్ అటెంప్ట్ కు పాల్పడ్డాడు. ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడేనికి చెందిన యువతికి లక్కవరం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి పెళ్లై నెల రోజులే అవుతోంది. ఆమె తన భర్తతో కలిసి ఆగస్టు 6 న పుట్టింటికి వెళ్లింది. అక్కడ శివ కుమార్ తో యువతికి ముందే పరిచయం ఉంది. పెళ్లయ్యాక పుట్టింటికి వెళ్లిన యువతిని చూసిన శివకుమార్ ఆమె వద్దకు ప్రేమిస్తున్నానని, నువ్వు లేకపోతే చనిపోతానని బెదిరించాడు. ఆమె నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పిటకీ అతను ఒప్పుకోలేదు. శివ కుమార్ మరో యువకుడి సహాయంతో యువతిని బలవంతంగా కారులో ఎక్కించారు. జంగారెడ్డిగూడెంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బంధించారు. పెళ్లి చేసుకోవాలని వేధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలిని తీవ్రంగా కొట్టాడు. ఎవరూ లేని సమయంలో ఆమెను ఇంటి వద్ద దింపి వెళ్లిపోయాడు.
అయితే యువతి ప్రవర్తనలో మార్పు రావడంతో కుటుంబసభ్యులు విషయం ఆరా తీశారు. ఆమె చెప్పింది విని నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి శివకుమార్, మరికొందరిపై కేసు నమోదు చేశారు. తనపై కేసు నమోదవడం, ఏ సమయంలోనైనా తనను అరెస్టు చేస్తారమే భయంతో ఆగస్టు 29 న రాత్రి శివకుమార్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్లీపింగ్ పిల్స్ మింగి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. పెళ్లి కాక ముందు నుంచే యువతి అంటే తనకు ఇష్టమని, తమ ప్రేమను ఇంట్లో ఒప్పుకోలేదని పోలీసులకు తెలిపాడు. అంతే కాకుండా గతంలో తనపై కేసు కూడా పెట్టారని చెప్పాడు. ఈ పరిణామాలతో మనస్తాపానికి గురై చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు శివ కుమార్ పేర్కొన్నాడు.
మరిన్ని ఏపీ వార్తల కోసం