YS Jagan: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరమపధించి నేటికి 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. 2009 సెప్టెంబర్ 2న రచ్చబండ కార్యక్రమానికి హాజరుకావడానికి హెలికాప్టర్‌లో బయలు దేరిన రాజశేఖర్ రెడ్డి ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నేడు (గురువారం) రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన అభిమాలనుతో పాటు, పలువురు రాజకీయ నాయకులు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా వైఎస్‌ఆర్‌ను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా భావోద్వేగానికి గురయ్యారు. ఈ విషయమై జగన్ ట్వీట్ చేస్తూ.. ‘నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ,చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది’ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే వైఎస్‌ఆర్ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్‌తో పాటు అతని కుటుంబసభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు.చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ,చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది#YSRForever
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2021
Also Read: Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ.. ఈరోజు ఈడీ ముందుకు హీరోయిన్ ఛార్మి..
Kerala: కేరళలో మళ్లీ విజృంభణ.. కర్నాటకలో కంగారు, మహమ్మారి వ్యాప్తి అక్కడి నుంచే ఎక్కువట.!