AP CM Jagan Kadapa Tour: నేటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం జగన్. ఏటా క్రిస్మస్ పండుగను సొంతూరు పులివెందులలో జరుపుకునే సీఎం ఈసారి 2 రోజులు ముందే జిల్లాకు చేరుకుంటున్నారు. మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్ గోపవరం, ప్రొద్దుటూరు, కొప్పర్తి, ఇడుపులపాయ, పులివెందులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రొద్దుటూరు, పులివెందులలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. ఉదయం 10 గంటల 40 నిమిషాలకు కడప ఎయిర్‌పోర్టు చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి ప్రొద్దుటూరు మండలం గోపవరం చేరుకుంటారు. 11 గంటలకు బొల్లవరం హెలిప్యాడ్ నుంచి ఆ గ్రామంలోని బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్దాపన చేసి బహిరంగ సభలో మాట్లాడతారు.
ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటి 35 నిమిషాలకు బద్వేలు నియోజకవర్గం గోపవరం ప్రాజెక్టు కాలనీ–1కి చేరుకుంటారు. అక్కడ బద్వేలు రెవెన్యూ డివిజన్ కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేసిన అనంతరం మెజర్స్ సెంచురీ ఫ్లై పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి సీకే దిన్నె మండలం కొప్పర్తికి చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఆర్చిని ప్రారంభించి, వైఎస్సార్ ఈఎంసీ ఇండస్ట్రియల్ ఎన్‌క్లేవ్ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శిస్తారు.
తరువాత ఇడుపులపాయ చేరుకుని అక్కడ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. రేపు ఉదయం 9 గంటలకు వైఎస్సార్ ఘాట్‌కు చేరుకొని సమాధివద్ద నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి ఇడుపులపాయ ప్రార్థనా మందిరానికి చేరుకొని ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. వైఎస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ చేసి బహిరంగసభలో లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడుతారు.
ఎల్లుండి సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం కడప ఎయిర్‌పోర్టుకు చేరుకొని మధ్యాహ్నం ఒంటి గంట 40 నిమిషాలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరుతారు.
ఇవి కూడా చదవండి: Pralay Missile: చైనా గుండెల్లో వణుకుపుట్టిస్తున్న ప్రళయ్.. భారత క్షిపణి పరీక్ష విజయవంతం..