AP Exams: ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ.. ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్..

|

Jun 17, 2021 | 10:16 AM

విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కీలక నిర్ణయం ఇవాళ వెలువడనుంది. ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వాహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

AP Exams: ఏపీ పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ.. ఇవాళ కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్..
CM YS Jagan
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కీలక నిర్ణయం ఇవాళ వెలువడనుంది. ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వాహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఉదయం 11 గంటలకు విద్యా శాఖ అధికారులతో “నాడు నేడు” పై సీఎం వైఎస్ జగన్ సమిక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా విధ్యా శాఖ సిద్దం చేసిన ప్రతిపాదనలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయంపై విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో ఉత్కంఠతో ఉన్నారు. ఇదిలావుంటే విద్యా శాఖ పరీక్షల నిర్వాహనపై ఓ ప్రతిపాధనను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా.. జూలై 26 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇక జులై 7 నుండి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణ కు కసరత్తు మొదలు పెట్టార అధికారులు.

పదో తరగతి పరీక్షలకు 6.28 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు.  4వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. పరీక్షల నిర్వహణలో 80 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొననున్నట్లుగా తెలుస్తోంది.

అలాగే 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లకు పరీక్షలు నిర్వహించాలని అధికారులు ఇప్పటికే  సూచించారు. సెప్టెంబర్‌ 2లోపు పరీక్షా ఫలితాలు వెల్లడించనున్నట్లు చెప్పారు. గత ఏడాది కరోనా కారణంగా పరీక్షలు రద్దు చేయాల్సి వచ్చింది, ఈ ఏడాది సెకండ్ వేవ్ కారణంగా పరీక్షలు వాయిదా వేయాల్సి వచ్చింది. పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్ధులకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో కోవిడ్ నిబంధనలు అనుసరించి పరీక్షలు నిర్వహించడానికి  అధికారులు ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : DRDO Recruitment 2021: ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు డీఆర్‌డీఓలో ఉద్యోగాలు.. గేట్ స్కోర్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక‌.