తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. పేర్కొన్న అంశాలివే..

|

Jul 02, 2024 | 7:59 AM

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. జూలై 6న భేటీ అవుదామని లేఖలో ప్రతిపాదించారు. అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో భారీ మెజార్టీతో అధికారం సాధించిన ఎన్డీయే కూటమి వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. ఒకవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, మరోవైపు అభివృద్దిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సంక్షేమంలో భాగంగా సామాజిక పెన్షన్ల విషయంలో సీఎం చంద్రబాబు అవ్వతాతలను నేరుగా కలిసి పెన్షన్ అందించారు.

తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. పేర్కొన్న అంశాలివే..
Cm Chandrababu
Follow us on

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. జూలై 6న భేటీ అవుదామని లేఖలో ప్రతిపాదించారు. అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో భారీ మెజార్టీతో అధికారం సాధించిన ఎన్డీయే కూటమి వడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. ఒకవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, మరోవైపు అభివృద్దిపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే సంక్షేమంలో భాగంగా సామాజిక పెన్షన్ల విషయంలో సీఎం చంద్రబాబు అవ్వతాతలను నేరుగా కలిసి పెన్షన్ అందించారు. అలాగే అభివృద్దిలో భాగంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులపై అధికారులతో ఆరా తీశారు. అక్కడి వాస్తవ పరిస్థితుల గురించి ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే క్రమంలో రాజధాని ప్రాంతం అమరావతిపై ఫోకస్ పెట్టారు. ఇదిలా ఉంటే పక్కరాష్ట్రం నుంచి రావల్సిన విభజన ప్రయోజనాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. రేపు చంద్రబాబుకు తిరిగి తన అభిప్రాయాన్ని లేఖరూపంలో పంపించనున్నారు.

అయితే రెండు తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు జూలై 6న ప్రజాభవన్ వేదికగా మధ్యాహ్నం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సానుకూలంగా స్పందించారు. పక్క రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారితో సఖ్యతగా ఉంటామని మొదటి నుండి చెపుతూనే వస్తున్నారు. విభజన అంశాలు, అపరిష్కృత అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడా నష్టం వాటిల్లకుండా సంపూర్ణ ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకుందామనే దోరణిలోనే సీఎం రేవంత్ ఆలోచిస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. అయితే జూలై 4న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో జూలై 6న వీరిద్దరి భేటీపై అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఢిల్లీలో రాష్ట్రానికి రావల్సిన ప్రయోజనాల గురించి ప్రధాని మోదీకి చెప్పి, ఇటు అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డితో కూడా సంప్రదింపులు జరిపి ప్రయోజనాలు అందిపుచ్చుకునేలా చర్యలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణకు సంబంధించిన అంశాలు మరోసారి తెరపైకి రానున్నాయి వీటిపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అన్న ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి