AP Cabinet: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం.. రాష్ట్రంలో రెండో భాషగా ఉర్దూ..
Urdu Language: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక చట్టాల సవరణలకు ఆమోదం పలకడంతోపాటు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండో భాషగా ఉర్దూను గుర్తిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయించింది.

Urdu Language: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక చట్టాల సవరణలకు ఆమోదం పలకడంతోపాటు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండో భాషగా ఉర్దూను గుర్తిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దీనిలో భాగంగా.. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా చట్టం 1966కు సవరణ చేయాలని తీర్మానించింది. అలాగే విదేశీ మద్యం నియంత్రణ చట్టసవరణకు కూడా నిర్ణయం తీసుకుంది. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం పలికింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం జరిగిన ఏపీ కేబినెట్ (AP Cabinet) సమావేశంలో 35 కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులపై అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ శాసనసభలో ప్రవేశపెట్టనున్న బిల్లుకు ఆమోదం లభించింది. ఉర్దూను సెకెండ్ లాంగ్వేజ్‌గా చదువుకునేందుకు చట్ట సవరణకు కేబినెట్ నుంచి ఆమోదం లభించింది.
తూనికలు, కొలతలశాఖలో నిబంధనలు అమలు కోసం మెరుగైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్భర్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1234 కోట్ల రూపాయిలతో మూడు ఫిషింగ్ హార్భర్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. బెంగుళూరు–కడప, విశాఖపట్నం–కడప మధ్య వారానికి మూడు విమాన సర్వీసులు నడపేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. సర్వీసులు మొదలైన తర్వాత ఏడాదికి రూ.15 కోట్ల మేర మద్దతును రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది.
దీంతోపాటు మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం పోర్టుల నిర్మాణం కోసం రూ.8,741 కోట్ల రుణ సమీకరణకు ఏపీ మారిటైం బోర్డుకు హామీ ఇచ్చేందుకు ఏపీ మంత్రివర్గం అంగీకరిస్తూ తీర్మానం చేసింది. మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.214 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది. రూ.8741 కోట్ల రుణ సమీకరణకు ఏపీ మారిటైం బోర్డుకు హామీ ఉండేందుకు కేబినెట్ ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసింది.
Also Read: