Andhra Pradesh: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.. బడ్జెట్ ప్రజెంటేషన్ తేదీలో మార్పు..

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం (నేటి నుంచి) ప్రారంభంకానున్నాయి. ఉదయం 0 గంటలకు శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తారు. నజీర్‌ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడనున్నాయి..

Andhra Pradesh: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.. బడ్జెట్ ప్రజెంటేషన్ తేదీలో మార్పు..
Ap Assembly Budget Session (File Photo)

Updated on: Mar 14, 2023 | 6:39 AM

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం (నేటి నుంచి) ప్రారంభంకానున్నాయి. ఉదయం 0 గంటలకు శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగిస్తారు. నజీర్‌ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడనున్నాయి. ఇదిలా ఉంటే బడ్జెట్‌ను ఈనెల 18వ తేదీన ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ 18వ తేదీకి బదులు ఈ నెల 16వ తేదీనే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన ప్రకటించారు. 2023-24 వార్షిక బడ్జెట్‌ కీలకంగా మారనుంది. వైసీపీకి ఈ దఫా ఇదే చివరి బడ్జెట్‌ కావడంతో అందరి దృష్టి పడింది.

ఇదిలా ఉంటే ఈ నెల 14 నుంచి 24 వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కనీసం 7, 8 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మంగళవారం బీఏసీ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులను కేబినెట్‌ ఆమోదించనుంది. ఇక ఈ ఏడాది రూ. 2లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.

వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో సంక్షేమ పథకాలను మరింత ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, కొత్త పథకాలను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..