
ఏపీ ప్రభుత్వం చేపట్టిన టీటీడీ బోర్డు నియామకంపై విపక్షాల విమర్శలు చేస్తున్నాయి. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమని..మరోసారి ఏపీ సీఎం స్పష్టం చేశారంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తిరుమల పవిత్రతకు మచ్చ తెచ్చేలా నియామకాలున్నాయంటూ ఆరోపించారు. పూర్తీ వివరాల్లోకి వెళ్తే..
టీటీడీ బోర్డు సభ్యులుగా అర్హత లేని వారిని నియమించారని విపక్షాలు మండిపడుతున్నాయి. వారిని తొలగించకపోతే చూస్తు ఊరుకోమని.. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బీజేపీ హెచ్చరిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకంపై ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి విపక్షాలు. TTD బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమని మళ్లీ నిరూపించారని విమర్శించారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. తిరుమల పవిత్రతకు మచ్చ తెచ్చే ఈ నియామకాలను BJP ఖండిస్తోందన్నారు.
టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి. అర్హత లేని వారిని నియమించడమేంటని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందరూ గుర్తు పెట్టుకొనే విధంగా రెండు సంవత్సరాల కాలం పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ పొన్నాడ సతీష్.
TTD పాలకమండలిలో చోటు కోసం పలు రాష్ట్రాలు, పలు రంగాల నుంచి వచ్చిన అనేక వినతులను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీకి చెందిన నలుగురు బీసీలు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి ప్రభుత్వం స్థానం కల్పించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..