Andhra Pradesh: ఏపీ బీజేపీలో అంతర్గత కలహాలు.. కీలక నేతల పరస్పర విమర్శనాస్త్రాలు..

|

Feb 17, 2023 | 9:36 PM

ఎన్టీఆర్‌, వైఎస్‌లపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్‌లో స్ట్రాంగ్‌గా రియాక్ట్‌ అయ్యారు పురంధేశ్వరి. జీవీఎల్‌..

Andhra Pradesh: ఏపీ బీజేపీలో అంతర్గత కలహాలు.. కీలక నేతల పరస్పర విమర్శనాస్త్రాలు..
Andhra Prdaesh Bjp Leaders
Follow us on

ఏపీ కమలంలో కల్లోలం.. కన్నా రాజీనామా ఎపిసోడ్‌ జరిగిన కొన్ని గంటల్లోనే పురంధేశ్వరి ట్వీట్లు కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము విర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావును కలిపి కన్నా లక్ష్మీ నారాయణ టార్గెట్‌ చేస్తే, జీవీఎల్‌ వ్యాఖ్యాల్ని విమర్శిస్తూ ఏకంగా సోషల్‌ మీడియాలోనే కౌంటర్లు ఇచ్చారు పురంధేశ్వరి. కన్నా తరహాలోనే రావెల కూడా స్వరం కలిపారు. ఎన్టీఆర్‌, వైఎస్‌లపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్‌లో స్ట్రాంగ్‌గా రియాక్ట్‌ అయ్యారు పురంధేశ్వరి. జీవీఎల్‌ చేసిన వ్యాఖ్యల వీడియోను అటాచ్‌ చేస్తూ మరీ కౌంటర్‌ ఇచ్చారు. ‘రాష్ట్రంలో ఆ రెండు కుటుంబాలేనా, ఎక్కడ చూసినా ఆ ఇద్దరి పేర్లేనా’ అంటూ గురువారం ఎన్టీఆర్‌, వైఎస్‌ పేర్లపై వ్యాఖ్యలు చేశారు జీవీఎల్‌. ఈ క్రమంలోనే వంగవీటి రంగా పేరు కూడా జిల్లాకు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అయితే ‘ఆ ఇద్దరేనా’ అంటూ జీవీఎల్‌ అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు పురంధేశ్వరి. ‘ఆ ఇద్దరూ కాదు.. ఆ మహానుభావాలు’ అంటూ ట్వీట్‌ చేశారు. ఎన్టీఆర్ తెలుగు జాతికి గుర్తింపు తెచ్చి పేదలకు నిజమైన సంక్షేమం, రూ.2కే కిలో బియ్యం ఇచ్చారని గుర్తు చేశారు. పక్కా గృహాలు, జనతా వస్త్రాలు, మహిళా విశ్వవిద్యాలయం వంటివి ప్రజలకు అందించారని ట్వీట్‌ చేశారు పురంధేశ్వరి. వైఎస్‌ఆర్‌ ఫీజు రీఎంబర్స్‌మెంట్, 108 ఉచిత అంబులెన్స్ సేవలు, ఆరోగ్యశ్రీని అందించారని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు తన వల్లే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలపై స్పందించబోనన్నారు సోము వీర్రాజు. చాలా రోజుల కిందటే బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోయిన రావెల కిశోర్‌బాబు కూడా ఈ క్రమంలోనే సోముపై కారాలు మిరియాలు నూరారు. అయితే కన్నా, రావెల పార్టీని వీడి విమర్శలు చేశారు. కానీ సీనియర్‌ నేత పురంధేశ్వరి ఏకంగా ఎంపీ జీవీఎల్‌కే కౌంటర్లు ఇవ్వడం బీజేపీలో తీవ్ర చర్చనీయాంశమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..