ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. గురువారం ఢిల్లీ వెళ్లిన ఆమె నడ్డా నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం తన పై నమ్మకం ఉంచినందుకు నడ్డాకి కృతజ్ఞతలు తెలియజేశానంటూ ట్వీట్ చేశారు. అలాగే ఏపీలో బీజేపీ బలోపేతం కోసం కృషి చేస్తానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశాను. నాపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాను. నిబద్ధతో పనిచేసి ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను. ఏపీ, ఆంధ్రుల హక్కులు కాపాడేందుకు కృషి చేస్తాను’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు పురంధేశ్వరి. కాగా సోము వీర్రాజు స్థానంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమిస్తూ బీజేపీ అధిష్టానం మంగళవారం (జూన్ 4) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
కాగా ఏపీలో గత మూడేళ్లుగా సోము వీర్రాజు ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్నారు. అయితే ఆయనపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే వీర్రాజు హయాంలోనే కన్నా లక్ష్మీ నారాయణ వంటి కీలక నాయకులు పార్టీని వీడారు. ఈక్రమంలోనే సోము వీర్రాజు స్థానంలో పురంధేశ్వరని బీజేపీ అధ్యక్షురాలిగా నియమించింది బీజేపీ అధిష్ఠానం.
Met @JPNadda Ji and expressed my heartfelt gratitude for the trust imposed on me. I assured him of my unwavering commitment towards the responsibility. Even as I work to strengthen BJP in AP, I shall also work towards safeguarding the interests of AP and Andhrites.
#BJP pic.twitter.com/LeYCzQ8P6F
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) July 6, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.