
పొత్తులు- ఎత్తులు ఒకవైపు.. పార్టీ గెలుపు మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై జనసేన స్పెషల్ ఫోకస్ పెట్టింది. పోటీ చేసే అన్ని స్థానాల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 16 మంది అభ్యర్థులను ప్రకటించిన జనసేన పార్టీ, తాజాగా మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ, బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లు దక్కాయి. ఇందులో భాగంగా విడతల వారీగా జనసేన తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.
పొత్తులో భాగంగా కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, ఏలూరు జిల్లాలోని పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాలను జనసేనకు కేటాయించారు. ఈ రెండు స్థానాలు జనసేన అభ్యర్థులను ఖరారు చేసింది. పి.గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ, పోలవరం నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజు పేర్లను ప్రకటించింది జనసేన. ఈ మేరకు ఎన్నికల నియమావళి పత్రాలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అందజేశారు. రెండు నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలతో భేటీ అయిన పవన్ కల్యాణ్.. సుదీర్ఘంగా చర్చించి, అందరి అభిప్రాయాల మేరకు ఇద్దరు పేర్లను ఫైనల్ చేశారు. రెండు నియోజకవర్గాల్లో కచ్చితంగా జనసేనదే గెలుపు అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
1.పిఠాపురం – కొణిదెల పవన్ కళ్యాణ్
2.అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
3.రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
4.నెల్లిమర్ల – లోకం మాధవి
5.తెనాలి – నాదెండ్ల మనోహర్
6.కాకినాడ రూరల్ – పంతం నానాజీ
7.నిడదవోలు – కందుల దుర్గేష్
8.తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్
9.నరసాపురం – బొమ్మిడి నాయకర్
10.ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు
11.భీమవరం – పులపర్తి రామాంజనేయులు
12.పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు
13.యలమంచిలి – విజయ్ కుమార్
14.విశాఖ సౌత్ – వంశీకృష్ణ యాదవ్
15.రాజోలు – వరప్రసాద్
16.తిరుపతి – ఆరణి శ్రీనివాసరావు
17. పి. గన్నవరం – గిడ్డి సత్యనారాయణ
18. పోలవరం – చిర్రి బాలరాజు
ఇప్పటివరకు 18 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన జనసేన, మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, కూటమిలో కలిసి పనిచేసి టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు సహకరించాలంటూ జనసేన నేతలకు దిశానిర్దేశం చేశారు పవన్ కల్యాణ్. అధికారంలోకి వచ్చాక సముచిత న్యాయం చేస్తామని భరోసా కల్పిస్తున్నారు. మరోవైపు నాగబాబు, నాదెండ్ల ఎన్నికల సందర్భంగా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీలోని వర్గాలను సెట్‌రైట్ చేస్తూనే.. టిక్కెట్ దక్కని నేతలను దారికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు కీలక నేతలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…