AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Budget 2022 Live: ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2,56,256 కోట్లు.. అసెంబ్లీ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన

Andhra Pradesh Budget 2022-23 Live Updates: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించనున్న 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు.2లక్షల 56 వేల 257 కోట్లతో బడ్జెట్‌ను రాష్ట్ర అసెంబ్లీ ముందుంచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగో బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు.

AP Budget 2022 Live: ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2,56,256 కోట్లు.. అసెంబ్లీ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన
Ap Budget Cm Ys Jagan Buggana
Balaraju Goud
|

Updated on: Mar 11, 2022 | 1:55 PM

Share

Andhra Pradesh Budget 2022-23 Live Updates: మరికాసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్‌(AP Budget) ప్రవేశపెట్టబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బడ్జెట్‌లో కేటాయింపులపై ఉత్కంఠగా ఎదరుచూస్తున్నారు ఏపీ ప్రజలు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి(Buggana Rajendranath Reddy) రాష్ట్రవార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా.. మంత్రి కన్నబా(Kanna Babu)బు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ రూపకల్పనపై సుదీర్ఘంగా కసరత్తు చేసిన ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేకున్నా.. ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) . ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా బడ్జెట్‌ ఉంటుందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.

2021-22లో రెండు లక్షల 30వేల కోట్ల అంచనాతో బడ్జెట్‌ ప్రవేశపెట్టగా.. ఈ సారి రెండున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నందున బడ్జెట్‌లో ప్రజా సంక్షేమానికే పెద్దపీట వేయబోతున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌లో ముఖ్యంగా నవరత్నాలకు అధిక నిధులు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అటు జగనన్న కాలనీలు, విద్య, వైద్యానికి కూడా బడ్జెట్‌లో భారీ కేటాయింపులు ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమలవుతున్న పథకాలతోపాటు కాకుండా కొత్తవాటికి ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయా అనేది చర్చనీయాంశమైంది. బడ్జెట్‌లో అన్నిరంగాలకు ప్రాధాన్యమిచ్చేలా కేటాయింపులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వైద్యం, విద్యపై సీఎం జగన్‌ ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు వ్యవసాయానికి పెద్దపీట వేసినట్లు సమాచారం. సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఉండనున్న బడ్జెట్‌కు ఇవాళ అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Mar 2022 11:37 AM (IST)

    మతాలు, కులాల కార్పోరేషన్లకు భారీగా నిధులు

    • కాపుల సంక్షేమంః రూ. 3,531.68 కోట్లు
    • మైనార్టీల సంక్షేమంః రూ. 1750.50 కోట్లు
    • ఏపీ స్టేట్ క్రిష్టియన్ కార్పొరేషన్ః రూ. 113.4 కోట్లు
    • బ్రాహ్మణ కార్పొరేషన్ః రూ. 455. 23కోట్లు
    • అర్చకుల కోసంః రూ.122 కోట్లు
    • ఏపీ రెడ్డీ వెల్ఫేర్ కార్పొరేషన్ః రూ. 3, 088.99 కోట్లు
    • ఏపీ కమ్మ వెల్ఫేర్ కార్పొరేషన్ః రూ. 1,899.74 కోట్లు
    • వైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ః రూ. 915. 49 కోట్లు
    • క్షత్రియ వెల్ఫేర్ కార్పొరేషన్ః రూ. 314.02 కోట్లు
    • ఈబీసీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంటుః రూ. 139.18 కోట్లు
    • బీసీ కార్పొరేషన్ః రూ. 6345.82 కోట్లు…
  • 11 Mar 2022 11:34 AM (IST)

    టీడీపీ సభ్యులపై స్పీకర్ సీరియస్

    ఏపీ బడ్జెట్‌ ప్రసంగం కొనసాగుతుండగా.. తెలుగు దేశం పార్టీ శాసనసభ్యులు మంత్రి బుగ్గన ప్రసంగానికి అడ్డుకున్నారు. దీంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం అసహనం వ్యక్తం చేశారు. సభకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్‌ తమ్మినేని, టీడీపీ సభ్యుల్ని వారించారు.

  • 11 Mar 2022 11:31 AM (IST)

    సెకండరీ ఎడ్యుకేషన్ రూ.27,706 కోట్లు.

    రెవెన్యూ శాఖకు రూ. 5306 కోట్లు

    వృత్తి నైపుణ్యం రూ. 969 కోట్లు

    వ్యవసాయకు రూ.11,387 కోట్లు

    పశుసంవర్ధన శాఖకు రూ.1568 కోట్లు

    ఉన్నత విద్యకు రూ.2014 కోట్లు

    సాంఘిక సంక్షేమ శాఖకు రూ.12,768 కోట్లు

    సెకండరీ ఎడ్యుకేషన్ రూ.27,706 కోట్లు.

    విద్యుత్ రూ.10,281 కోట్లు

  • 11 Mar 2022 11:31 AM (IST)

    క్రీడాశాఖకు రూ.290 కోట్లు

    న్యాయశాఖకు 924 కోట్లు

    కార్మిక శాఖకు రూ.790 కోట్లు.

    ఐటీశాఖకు రూ.211 కోట్లు.

    క్రీడాశాఖకు రూ.290 కోట్లు.

  • 11 Mar 2022 11:30 AM (IST)

    శాఖల వారీగా కేటాయింపులు

    మౌళిక వసతులు రూ.1142 కోట్లు.

    పౌరసరఫరాలకు రూ.3719 కోట్లు.

    పరిశ్రమలు వాణిజ్యం రూ.2795 కోట్లు.

  • 11 Mar 2022 11:29 AM (IST)

    శాఖల వారీగా కేటాయింపులు

    మున్సిపల్ శాఖకు రూ.8796 కోట్లు.

    మైనార్టీ శాఖకు రూ. 2063 కోట్లు.

    పంచాయతీరాజ్ శాఖకు రూ.15,826 కోట్లు.

    హౌసింగ్ కు రూ.4791 కోట్లు.

    ఇరిగేషన్ రూ.11,482 కోట్లు

  • 11 Mar 2022 11:28 AM (IST)

    శాఖల వారీగా కేటాయింపులు

    అటవీ శాఖ రూ.685 కోట్లు

    రోడ్లు భవనాల శాఖకు రూ.8581 కోట్లు.

    వైద్యశాఖకు 15,384 కోట్లు.

    హోంశాఖకు రూ.7586 కోట్లు.

  • 11 Mar 2022 11:02 AM (IST)

    వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమం

    1,2 దశలలో పాఠశాల విద్యార్థులకు పరీక్షలు మూడవ దశలో అవ్వా తాతలకు కంటి పరీక్షలు

  • 11 Mar 2022 10:59 AM (IST)

    వ్యవసాయం:

    వ్యవసాయానికి రూ. 11,387 కోట్లు కేటాయింపు

    ఉన్నతవిద్యకు రూ. 2,014 కోట్లు

    సెకండరీ ఎడ్యుకేషన్ కు రూ.22,706 కోట్లు

    బిసి సంక్షేమానికి రూ.20,965కోట్లు

  • 11 Mar 2022 10:55 AM (IST)

    సంక్షేమానికి ప్రత్యేక నిధులు

    వాహన మిత్ర రూ.260 కోట్లు.

    YSR నేతన్న నేస్తం రూ. 200 కోట్లు.

    జగనన్న తోడు రూ.25 కోట్లు

    జగనన్న చేదోడు రూ.300 కోట్లు

    ఈబీసీ నేస్తం రూ. 590 కోట్లు

    YSR కాపు నేస్తం రూ. 500 కోట్లు.

  • 11 Mar 2022 10:54 AM (IST)

    ప్రజారోగ్యానికి ప్రాధాన్యత

    YSR ఆరోగ్య ఆసరా పథకానికి రూ.300 కోట్లు

    YSR ఆసరా పథకానికి రూ.6,400 కోట్లు.

    YSR చేయూత పథకానికి రూ. 4,235.95 కోట్లు

    YSR పింఛన్ కానుక 18000 కోట్లు

    వైఎస్సార్ భీమా 372.12 కోట్లు

  • 11 Mar 2022 10:53 AM (IST)

    సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత

    ధరల స్థిరీకరణ కోసం రూ.500 కోట్లు.

    రైతులకు విద్యుత్ సబ్సిడీ కోసం రూ.5000 కోట్లు

    పశుసంవర్ధక శాఖకు రూ.1,568.83 కోట్లు

  • 11 Mar 2022 10:51 AM (IST)

    సంక్షేమ పథకాలకు భారీగా కేటాయింపులు

    రైతు భరోసాకు రూ.3900 కోట్లు

    ఉచిత పంటల బీమా రూ.1802 కోట్లు.

    సున్నా వడ్డీ పంట రుణాలు రూ.500 కోట్లు

    RBK లకు రూ.18 కోట్లు

  • 11 Mar 2022 10:44 AM (IST)

    ఏపీలో 8.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు

    కరోనా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు మంత్రి బుగ్గన తెలిపారు. ఏపీలో 8.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశామన్నారు. ఇది రాష్ట్రంలోని జనాభా కంటే రెట్టింపు అని స్పష్టం చేశారు.

  • 11 Mar 2022 10:39 AM (IST)

    ఏపీ వార్షిక బడ్జెట్‌ రూ. 2,56,256 కోట్లు

    రెవెన్యూ వ్యయం రూ. 2,08, 261 కోట్లు మూలధన వ్యయం రూ. 47,996 కోట్లు రెవెన్యూలోటు రూ. 17,036 కోట్లు ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లు వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ. 18 వేల కోట్లు  వైఎస్సార్‌ రైతు భరోసా రూ. 3,900 కోట్లు 

  • 11 Mar 2022 10:38 AM (IST)

    ఏపీ వార్షిక బడ్జెట్

    ఏపీ వార్షిక బడ్జెట్ రూ.2,08,261కోట్లతో రూపొందించడం జరిగిందని రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

  • 11 Mar 2022 10:37 AM (IST)

    జీవనోపాధి:

    రాష్ట్రంలో 62 శాతానికి వ్యవసాయం ద్వారానే జీవనోపాధి

  • 11 Mar 2022 10:31 AM (IST)

    99.5 శాతం కాన్పులు స్థానికంగానే…

    విద్యుత్ రాష్ట్రంలోని వంద శాతం కుటుంబాలకు విద్యుత్ అందుతోంది. ఆరోగ్యం 99.5 శాతం కాన్పులు స్థానికంగానే జరుగుతున్నాయిః బుగ్గన

  • 11 Mar 2022 10:29 AM (IST)

    విద్యా, ఆరోగ్యం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యతః బుగ్గన

    విద్యా, ఆరోగ్యం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. విద్యా, ఆరోగ్యం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత… నాడు నేడు తో పాటు అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మంచి విద్యా,ఆరోగ్యాన్ని అందించేందుకి అనేక కార్యక్రమాలు తీసుకున్నాంః బుగ్గన.

  • 11 Mar 2022 10:28 AM (IST)

    పేదరికం నిర్మూలనలో ఏపీ ఐదో స్థానం

    పేదరిక నిర్మూలనలో ఏపీ ఐదో స్థానం నీతిఆయోగ్ ఎస్టీజి నివేదిక ప్రకారం పేదరిక నిర్మూలనలో ఐదో స్థానంలో ఏపీ కొనసాగుతోందిః బుగ్గన

  • 11 Mar 2022 10:28 AM (IST)

    తమిళ కవి తిరువళ్లువార్ మాటలతో బడ్జెట్ ప్రసంగం

    తమిళ కవి తిరువళ్లువార్ మాటలతో బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు.

  • 11 Mar 2022 10:26 AM (IST)

    సోషియో ఎకనామిక్‌ రిపోర్టు

    సోషియో ఎకనామిక్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ విడుదల చేయగా.. ముఖ్యాంశాలను విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. వ్యవసాయం రంగంలో 14.5 శాతం ప్రగతి నమోదు. సామాజిక, ఆర్థిక సర్వే 2021-22లో జీఎస్డీపీలో వృద్ధి రేటు బాగా పెరిగిందని తెలిపారాయన. పరిశ్రమల రంగంలో 25.5 శాతం, సేవా రంగంలో 18.9 శాతం ప్రగతి నమోదు అయ్యింది. తలసరి వృద్ధి రేటు కూడా రూ.31 వేలు పెరిగి.. 17.5 శాతం పెరిగింది. వివిధ సంక్షేమ పథకాల్లో ప్రగతి రావడంతో సుస్థిరాభివృద్ధి పెరిగిందని విజయ్‌ కుమార్‌ వెల్లడించారు.

  • 11 Mar 2022 10:24 AM (IST)

    ప్రారంభమయిన శాసన మండలి….

    శాసన మండలిలో ఏపీ వార్షిక బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి ప్రవేశ పెట్టారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి సీదిరి అప్పల రాజు ప్రవేశ పెట్టనున్నారు.

  • 11 Mar 2022 10:23 AM (IST)

    ఏపీ బడ్జెట్ పూర్తి సారాంశం

    మొత్తం బడ్జెట్ః 2లక్షల 56 వేల 257 కోట్లు

    రెవిన్యూ వ్యయంః 2 లక్షల 8 వేల 261.

    మూల ధన వ్యయంః 47,996 కోట్లు.

    రెవెన్యూ లోటుః 17,036 కోట్లు.

    ద్రవ్య లోటుః 48,724 కోట్లు.

    జీఎస్డీపీ రెవెన్యూ లోటుః 1.27 శాతం

    జీఎస్డీపీ ద్రవ్య లోటుః 3.64 శాతం.

  • 11 Mar 2022 10:20 AM (IST)

    2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన

    ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించనున్న 2022-23 వార్షిక బడ్జెట్‌ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు.2లక్షల 56 వేల 257 కోట్లతో బడ్జెట్‌ను రాష్ట్ర అసెంబ్లీ ముందుంచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగో బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టారు.

  • 11 Mar 2022 10:16 AM (IST)

    అసెంబ్లీ సమావేశం షురూ

    అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాల రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం

  • 11 Mar 2022 10:02 AM (IST)

    నవరత్నాలకే భారీ మొత్తంలో నిధులు

    ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో నవరత్నాలకే భారీ మొత్తంలో నిధులు కేటాయించినట్లు సమాచారం. ఈ సారి కూడా జెండర్ బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు. దాదాపుగా 2.60 లక్షల కోట్ల మేర బడ్జెట్ ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సారి బడ్జెట్ ను శాసనసభలో యధావిధిగా ఆర్దిక మంత్రి బుగ్గన.. శాసన మండలిలో పుష్పశ్రీవాణి ప్రవేశ పెట్టనున్నారు.

  • 11 Mar 2022 09:59 AM (IST)

    వార్షిక బడ్జెట్‌కు ఏపీ మంత్రివర్గం ఆమోదం

    ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించనున్న 2022-23 వార్షిక బడ్జెట్ కు ఏపీ మంత్రివర్గం ఆమోద మద్ర వేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగో బడ్జెట్ ను సభలో ప్రవేశ పెడుతున్నారు.

    Ap Budget Cm Ys Jagan

    Ap Budget Cm Ys Jagan

  • 11 Mar 2022 09:59 AM (IST)

    సోషియో ఎకనామిక్ సర్వే

    గత ఆర్థిక సంవత్సరానికి సోషియో ఎకనామిక్ సర్వే ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు.

  • 11 Mar 2022 09:08 AM (IST)

    రూ.30 వేల కోట్లతో వ్యవసాయ బడ్జెట్!

    సుమారు 2.5 లక్షల కోట్లతో సాధారణ బడ్జెట్.. రూ.30 వేల కోట్లకు పైగా అంచనాలతో వ్యవసాయ బడ్జెట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. నవరత్నాలు, రాష్ట్ర అభివృద్ధి, సాగు నీటి పథకాలకు ప్రాధాన్యతనిచ్చినట్టుగా తెలుస్తోంది.

  • 11 Mar 2022 09:07 AM (IST)

    బడ్జెట్‌ కాపీలకు ప్రత్యేక పూజలు

    ఏపీ సచివాలయానికి చేరుకున్న ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ కాపీలకు ప్రత్యేక పూజలు చేశారు.

  • 11 Mar 2022 08:21 AM (IST)

    ఉద‌యం 9 గంట‌ల‌కు రాష్ట్ర కేబినెట్ భేటీ

    ఈ రోజు ఉద‌యం 9 గంట‌ల‌కు రాష్ట్ర కేబినెట్ స‌మావేశం అవుతుంది. రాష్ట్ర బ‌డ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. అనంత‌రం ఈ రోజు ఉద‌యం 10:15 గంట‌ల‌కు అసెంబ్లీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ప్రవేశ పెట్టనున్నారు. అలాగే మండ‌లిలో మంత్రి అప్పలరాజు బ‌డ్జెట్ ప్రవేశ పెట్టే అవ‌కాశం ఉంది. కాగా, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు అసెంబ్లీలో పెట్టనున్నారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి వేణుగోపాల్ ప్రవేశపెట్టనున్నారు.

  • 11 Mar 2022 08:19 AM (IST)

    న‌వ‌ర‌త్నాల‌కు ప్రాధాన్యత

    సంక్షేమ ప‌థ‌కాలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇవేకాకుండా అభివృద్ది కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టుల‌తో పాటు కొన్ని భారీ స్థాయి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వీటికి బడ్జెట్‌లో భారీ స్థాయిలో ప‌ద్దులు కేటాయించే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా న‌వ‌ర‌త్నాల‌కు కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బ‌డ్జెట్ లో అధిక శాతం ప‌ద్దులు కేటాయించే అవ‌కాశం ఉంది.

  • 11 Mar 2022 08:17 AM (IST)

    రూ. 2.50 ల‌క్షల కోట్లతో బ‌డ్జెట్..?

    ఏపీ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర నాథ్ రెడ్డి అసెంబ్లీలో బ‌డ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఆర్థిక సంవ‌త్సరానికి రూ. 2.50 ల‌క్షల కోట్లతో బ‌డ్జెట్ ను ప్రవేశ పెట్టే అవ‌కాశం ఉంది. కాగా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దృష్ట్యా ఈ ఏడాది బ‌డ్జెట్ ఏ విధంగా రూపొందించార‌నే ఆస‌క్తి నెలకొంది.

  • 11 Mar 2022 08:16 AM (IST)

    2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి బ‌డ్జెట్

    ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం అయిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ అసెంబ్లీలో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రానికి బ‌డ్జెట్ ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.

Published On - Mar 11,2022 8:11 AM

Follow Us