AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో కీలకనేత టీడీపీకి గుడ్‌బై

తెలుగుదేశం పార్టీకి మరో కీలకనేత గుడ్‌బై చెప్పారు. విజయగనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కొండపల్లి కొండలరావు రాజీనామా చేశారు. తనకు టీడీపీలో అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేపు ఆదివారం రోజున తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో కలిసి వైసీపీలో చేరుతున్నట్లు కొండలరావు ఓ ప్రకటనలో తెలిపారు. “37 సంవత్సరాలుగా తెలుగదేశం పార్టీలో పనిచేస్తున్నాను. మానాన్న మాజీ ఎంపీ కొండపల్లి.. పైడితల్లి నాయుడు ఆధ్వర్యంలో టీడీపీని జిల్లాలో గెలుపించుకు వచ్చాం. 37 సంవత్సరాలు పనిచేసినా […]

మరో కీలకనేత టీడీపీకి గుడ్‌బై
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 23, 2019 | 6:47 PM

Share

తెలుగుదేశం పార్టీకి మరో కీలకనేత గుడ్‌బై చెప్పారు. విజయగనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కొండపల్లి కొండలరావు రాజీనామా చేశారు. తనకు టీడీపీలో అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రేపు ఆదివారం రోజున తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో కలిసి వైసీపీలో చేరుతున్నట్లు కొండలరావు ఓ ప్రకటనలో తెలిపారు.

“37 సంవత్సరాలుగా తెలుగదేశం పార్టీలో పనిచేస్తున్నాను. మానాన్న మాజీ ఎంపీ కొండపల్లి.. పైడితల్లి నాయుడు ఆధ్వర్యంలో టీడీపీని జిల్లాలో గెలుపించుకు వచ్చాం. 37 సంవత్సరాలు పనిచేసినా పార్టీలో నన్ను గుర్తించలేదు. 2014లో మా తమ్ముడిని ఎమ్మేల్యేగా గెలిపిస్తే నాకుమంచి అవకాశం ఇస్తామన్నారు కానీ మాటతప్పారు. నియోజకవర్గం నేతలు అందరు కేఏ నాయుడికి సీటు ఇవ్వద్దని చెప్పినా ఇచ్చారు. నాకు జరిగిన అన్యాయంతో పార్టీకి రాజీనామా చేస్తున్నాను. రేపు నియోజకవర్గంలోని అభిమానులతో వైసీపీలో చేరుతున్నాం” అని కొండపల్లి స్పష్టం చేశారు.

Follow Us