Polavaram Project: ఏపీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat) పర్యటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan)sy కలిసి ఆయన పోలవరంలో పర్యటించారు. పోలవరం (Polavaram) ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. దేవీపట్నం మండలం ఇందుకూరు 1లో నిర్వాసితులతో ముఖ్యమంత్రి జగన్ (CM Ys Jagan), మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Gajendra Singh Shekhawat )లు మాట్లాడారు. తాడువాయి పునరావాస కాలనీలో నిర్వాసితులతో ముచ్చటించారు. ప్రాజెక్టు పనుల పరిశీలన అనంతరం అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి షెకావత్ మాట్లాడుతూ.. పోలవరాన్ని వైఎస్‌ఆర్ ముందుకు తెచ్చారని, పోలవరాన్ని పూర్తి చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని మంత్రి షెకావత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ముందుగా 1970లో అనుకున్నారని, అప్పటి దివంగత రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నించారని కేంద్రమంత్రి తెలిపారు. 2014 ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తుందని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశ ఒక సంవత్సరంలో పూర్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, పునరావాస నిర్వాసితులకు మంచి వాతావరణం కనిపిస్తామని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. నిర్వాసితులకు ఇచ్చే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ లో 6.8 లక్షల నుండి 10 లక్షలు ఇస్తామన్న మాట నిలబెట్టుకుంటామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలవరం, ఆంధ్ర రాష్ట్రానికి ఒక జీవనాడి అని కేంద్ర మంత్రి చెప్పారు. అయితే పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తయితే ఏపీ మరింత సస్య శ్యామలం అవుతుందని సీఎం జగన్ వెల్లడించారు. వైఎస్సార్ హయాంలో భూసేకరణలో ఎకరానికి లక్షన్నరే ఇచ్చినవారికి రూ. 5లక్షలు ఇచ్చి న్యాయం చేస్తామని అన్నారు.
పునరావాస కాలనీ అద్భుతంగా ఉంది:
పునరావాస కాలనీ అద్భుతంగా ఉందని కేంద్ర మంత్రి అన్నారు. కాలనీలో మంచి వసతులు కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇచ్చిన మాటకు మోదీ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని, ప్రాజెక్టు మధ్యలో మరోసారి పర్యటిస్తా కేంద్ర మంత్రి షెకావత్ అన్నారు.
ఇవి కూడా చదవండి: