Prof.YC Simhadri: ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ఆచార్య సింహాద్రి కన్నుమూత.. కరోనా చికిత్సపొందుతూ మృతి
ప్రముఖ విద్యావేత్త ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యెడ్ల చిన సింహాద్రి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కన్నుమూశారు.
Prof.YC Simhadri: ప్రముఖ విద్యావేత్త ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యెడ్ల చిన సింహాద్రి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం విశాఖపట్నంలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కామినిలంకకు చెందిన సింహాద్రి.. దేశవ్యాప్తంగా నాలుగు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్‌గా పనిచేసిన ఆయన నిజాయితీకి మారుపేరుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.1991లో ఆంధ్రా యూనివర్సిటీ, 1994లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, 1997లో బెనారస్ హిందూ యూనివర్సిటీ, 2006 2008, 2014 2017లలో పాట్నా విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి ఆంధ్రుడు ప్రొఫెసర్ సింహాద్రి . ఆయా విశ్వవిద్యాలయాలలో సంస్థాగత సమస్యలు పరిష్కరిస్తూ క్రమశిక్షణతో అకడమిక్ కార్యకలాపాలను కొనసాగించారు.
జపాన్ కు చెందిన నౌకోను వివాహమాడి పేద బస్తీలలోని నిరుపేద పిల్లలకు విద్యనందించడానికి మంచి స్కూలును ఏర్పాటుచేసి విద్యా దానం చేశారు. యం.ఎ.సోషల్ వర్క్, క్రిమినాలజీ, సోషియాలజీలతో పాటు వెస్టరన్ రిజర్వ్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ ను పొందారు. లండన్ లో కామన్ వెల్త్ ఇనిస్టిట్యూట్ నుండి పోస్ట్ డాక్టరేట్ రీసెర్చ్ డిగ్రీని కూడా సొంతం చేసుకున్నారు. ఇండియన్ యూనివర్సిటీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులుగా కూడా ఆయన సేవలందించారు. ప్రొఫెసర్ సింహాద్రి సతీమణి నౌకో వేలాది పేద పిల్లలకు విద్యనందించినందుకు గాను ప్రతిష్టాత్మకమైన స్ఫూర్తి అవార్డును అందుకున్నారు.
Read Also… Music Dirictor Ram Laxman: బాలీవుడ్‌లో మరో విషాదం.. సంగీత దర్శకులు లక్ష్మణ్ కన్నుమూత