Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Music Director Ram Laxman: బాలీవుడ్‌లో మరో విషాదం.. సంగీత దర్శకులు లక్ష్మణ్ కన్నుమూత

బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇండస్ట్రీ మరో పెద్ద దిక్కును కోల్పోయింది. ‘హమ్ ఆప్కే హై కౌన్’ వంటి చిత్రాల సంగీత దర్శకుడు ల‌క్ష్మణ్‌ (78) నాగ్‌పూర్‌లో శ‌నివారం తుదిశ్వాస విడిచారు.

Music Director Ram Laxman: బాలీవుడ్‌లో మరో విషాదం.. సంగీత దర్శకులు లక్ష్మణ్ కన్నుమూత
Music Director Composer Laxman
Follow us
Balaraju Goud

| Edited By: Team Veegam

Updated on: May 22, 2021 | 10:13 PM

బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇండస్ట్రీ మరో పెద్ద దిక్కును కోల్పోయింది. ‘హమ్ ఆప్కే హై కౌన్’ వంటి చిత్రాల సంగీత దర్శకుడు ల‌క్ష్మణ్‌ (78) నాగ్‌పూర్‌లో శ‌నివారం తుదిశ్వాస విడిచారు. గుండె పోటుతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 2 గంట‌ల‌కు మరణించినట్లు ఆయ‌న కుమారుడు అమ‌ర్ తెలిపారు. ఇటీవ‌ల‌ే ఆయ‌న కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నార‌ని, అప్పటి నుంచి చాలా నీర‌సంగా, బ‌లహీనంగా క‌నిపించార‌ని ఆయ‌న కుమారుడు చెప్పారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ప్రముఖ స్వరకర్త ల‌క్ష్మణ్ మృతిప‌ట్ల ప్రముఖ గాయ‌కురాలు లతా మంగేష్కర్ త‌న సంతాపాన్ని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. “చాలా ప్రతిభావంతులైన, ప్రసిద్ధ సంగీత స్వరకర్త రామ్ లక్ష్మణ్ జీ (విజయ్ పాటిల్) కన్నుమూసినట్లు ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ వార్త విన‌గానే చాలా బాధ ప‌డ్డాను. అతను గొప్ప వ్యక్తి. నేను చాలా పాటలు పాడాను. అవి చాలా ప్రజాదరణ పొందాయి. ఆయన మృతి ప‌ట్ల‌ నివాళులు అర్పిస్తున్నాను. ” అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

రామ్-లక్ష్మణ్ సినీరంగ ప్రస్థానం… 

1942 సెప్టెంబ‌ర్ 16 న మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబంలో జ‌న్మించిన ఆయ‌న అస‌లు పేరు విజ‌య్ పాటిల్‌. సినిమాల్లో అవ‌కాశాలు వెతుక్కుంటున్న స‌మ‌యంలో సోద‌రుడు సురేంద్ర పాటిల్‌తో క‌లిసి రామ్‌ల‌క్ష్మణ్‌గా త‌మ పేర్లు మార్చుకున్నారు. 1975 లో సంగీత పరిశ్రమలోకి వచ్చిన విజయ్ పాటిల్, సురేంద్ర పాటిల్.. రామ్ లక్ష్మణ్ పేరుతో సంగీత పరిశ్రమలోకి ప్రవేశించారు. ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్కే హై కౌన్’, ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రాలకు సంగీతం అందించిన రామ్ లక్ష్మణ్.. నాగ్‌పూర్‌లో తన కుమారుడు అమర్‌తో కలిసి నివసిస్తున్నాడు.

1976లో విడుదల అయిన ‘ఏజెంట్ వినోద్’ సినిమాకు సంగీతం ఇచ్చిన సురేంద్ర పాటిల్ అనారోగ్యంతో మరణించారు. అనంత‌రం విజయ్ పాటిల్ ఒక్కడే రామ్ లక్ష్మణ్ పేరుతో తన సంగీత ప్రయాణాన్ని కొనసాగించారు. హిందీలోనే కాకుండా మరాఠీ చిత్రాల‌కు కూడా సంగీతం అందించారు. దాదా కొండ్కే దర్శకత్వం వహించిన ‘పాండు హవల్దార్’ (1975) సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం కూడా చేశారాయ‌న‌.

రామ్ లక్ష్మణ్‌కు సూర‌జ్ బ‌ర్జాత్యా సినిమా ‘మైనే ప్యార్ కియా’ నుంచి పెద్ద క్రేజ్ లభించింది. ఈ సినిమా పాట‌ల‌కుగాను ఆయన ఉత్తమ సంగీత కంపోజర్‌గా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. 1999 లో వీ ఆర్ టుగెద‌ర్ ఆయ‌న చివరి సినిమా.