AP Politics: ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌తో కొత్త పార్టీ పురుడుపోసుకొనుందా?

|

Dec 24, 2022 | 7:43 AM

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలతో కొనసాగుతోన్న ఏపీ..

AP Politics: ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌తో కొత్త పార్టీ పురుడుపోసుకొనుందా?
Rayalaseema
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజు ఒకరిపై ఒకరు మాటల యుద్ధాలతో కొనసాగుతోన్న ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌తో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పార్టీ పెట్టబోతున్నారా? నీళ్లు నిధులు ఉద్యోగాలే లక్ష్యంగా మళ్లీ పోరాటానికి బైరెడ్డి రెడీ అవుతున్నారా..? ఏం చేయబోతున్నారు?. బైరెడ్డి మనసులో అసలేముంది? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

రాయలసీమ హక్కుల సాధన కోసం మరోసారి పోరాటానికి సిద్ధమవుతున్నారు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. సంక్రాంతి ఫెస్టివల్‌ తర్వాత రాయలసీమ మొత్తం తిరిగి, సీమ వాసులకు జరుగుతోన్న అన్యాయాన్ని వివరిస్తానంటున్నారు. నీళ్లు నిధులు ఉద్యోగాలే లక్ష్యంగా కర్నూలులో రాయలసీమ మేధావుల సదస్సు నిర్వహించారు బైరెడ్డి. రాయలసీమకు న్యాయ రాజధాని ముఖ్యంకాదన్నారు ఆయన. నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తేనే రాయలసీమ దరిద్రం తీరుతుందంటున్నారు.

శ్రీభాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో ఎప్పుడో రాజధాని ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు బైరెడ్డి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు అంటూ ప్రజలను కన్ఫ్యూజ్‌ చేస్తోందని మండిపడ్డారు. రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటు చేసినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినా, దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోలేకపోయామన్నారు బైరెడ్డి. ఇప్పుడు, రాయలసీమ ప్రజలు డిమాండ్‌ చేస్తే పార్టీ పెడతానంటూ సంకేతాలు ఇచ్చారు. రాయలసీమ సమస్యలపై త్వరలో ప్రధాని మోదీని కలవబోతున్నట్లు తెలిపారు బైరెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..