Andhra Pradesh: ఆకలితో అడవి వదిలి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు.. కట్ చేస్తే తెల్లారేసరికి మృతి!

అడవిలో ఉన్నంతవరకే అటు వన్యప్రాణికి, ఇటు ప్రజలకు సురక్షితం. అడవిని వదిలి జనావాసాల్లోకి వచ్చాయో.. అటు ఏనుగులో, ఇటు ప్రజలో బలికావాల్సిందే. రీసెంట్‌గా ఏనుగుల గుంపు రైతులపై దాడి చేస్తే.. మరోచోట కంచెకు వేసిన కరెంట్ తగిలి ఏనుగు చనిపోయింది..

Andhra Pradesh: ఆకలితో అడవి వదిలి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు.. కట్ చేస్తే తెల్లారేసరికి మృతి!
Elephant Died In Chittoor

Updated on: Nov 02, 2022 | 9:41 PM

అడవిలో ఉన్నంతవరకే అటు వన్యప్రాణికి, ఇటు ప్రజలకు సురక్షితం. అడవిని వదిలి జనావాసాల్లోకి వచ్చాయో.. అటు ఏనుగులో, ఇటు ప్రజలో బలికావాల్సిందే. రీసెంట్‌గా ఏనుగుల గుంపు రైతులపై దాడి చేస్తే.. మరోచోట కంచెకు వేసిన కరెంట్ తగిలి ఏనుగు చనిపోయింది.

అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు జనావాసాల్లోకి రావడంతో ప్రజలు హడలిపోతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు హల్ చల్ చేశాయి. సీతానగరం మండలం పనుకువలస శివారు పొలాల్లో ఏనుగుల గుంపు పంటలను నాశనం చేశాయి. పొలంలో పనిచేస్తున్న ఇద్దరు రైతులపై దాడి చేశాయి. ఏనుగుల దాడిలో గాయపడ్డ రైతులు హాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొన్నాళ్లుగా రెండు జిల్లాలో పచ్చటిపొలాలు, అరటి తోటలు ధ్వంసం చేస్తున్నా.. చేసేదేం లేక దిక్కుతోచని స్థితిలో మౌనంగా ఉండిపోతున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఏనుగుల్ని అదుపు చేయడంలో అటు అటవీశాఖ అధికారులు చేతులెత్తేశారని రైతులు ఆరోపిస్తున్నారు.

మరోచోట ఆకలితో అడవి వదిలి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగుకి అదే చివరి రోజైంది. మేతకు పొలాల్లోకి వెళ్లిన ఏనుగు కరెంట్ షాక్‌కు గురై గిలగిల కొట్టుకొని చనిపోయింది. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా వీ-కోట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. పొలంలో ఏనుగు పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనపై ఆరా తీసిన అధికారులు.. పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఏనుగు మరణించినట్టు తేల్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.