AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో వచ్చే మూడు రోజుల వాతావరణం ఎలా ఉండనుందంటే…?

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో వర్షాలతో పాటు గంటకు 30–40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

ఏపీలో వచ్చే మూడు రోజుల వాతావరణం ఎలా ఉండనుందంటే...?
Weather
Ram Naramaneni
|

Updated on: Oct 01, 2026 | 1:21 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలతో పాటు రాయలసీమలోనూ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఉత్తర కోస్తా తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. అలాగే ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి మన్నార్ గల్ఫ్ వరకు అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉత్తర–దక్షిణ ద్రోణి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

కోస్తాంధ్ర, యానాంలో..

కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో గురు, శుక్ర, శనివారాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో గంటకు 30–40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని IMD తెలిపింది.

రాయలసీమలోనూ వర్షాలు

రాయలసీమలో గురువారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 30–40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

శుక్ర, శని వారాల్లో కూడా రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రెండు రోజుల్లోనూ గంటకు 30–40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Follow Us