బ్రాండ్ టీ పౌడర్ అని ప్రశాంతంగా టీ తాగుతున్నారా? అయితే, ఇటు ఓ లుక్కేసుకోండి.. గుండె ఝల్లుమనడం ఖాయం..!

|

Aug 03, 2023 | 9:05 AM

Sattenapalle News: అచ్చం ఆ బ్రాండెడ్ టీ ఫౌడర్ల మాదిరిగా బాక్స్‌లు తయారు చేసి, నకిలీ టీ ఫౌడర్లను విక్రియస్తున్నారు. చూడటానికి లోగోలు, ప్యాకింగ్ స్టయిల్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. రేటు కూడా సేమ్ ఉంటుంది. పై తగ్గేదే లేదు. కానీ, ప్యాక్ ఓపెన్ చేస్తే మాత్రం అందులోని సరుకు వందకు వందశాతం కల్తీదే ఉంటుంది. తాజాగా సత్తెనపల్లిలో ఈ నకిలీ టీ ఫౌడర్ వ్యవహారం బయటపడింది.

బ్రాండ్ టీ పౌడర్ అని ప్రశాంతంగా టీ తాగుతున్నారా? అయితే, ఇటు ఓ లుక్కేసుకోండి.. గుండె ఝల్లుమనడం ఖాయం..!
Fake Tea Powder
Follow us on

సత్తెనపల్లి, ఆగష్టు 03: మార్కెట్‌లో చాలా రకాల బ్రాండ్ల డీ ఫౌడర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రజలు చాలా వరకు మంచి కంపెనీ, బ్రాండ్ అనే నమ్మకంతోనే వీటిని కొనుగోలు చేస్తారు. అయితే, ఈ నమ్మకాన్నే క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్లు. టీవీల్లో కీలక యాడ్స్ వచ్చే టీ ఫౌడర్స్‌, బ్రాండెడ్ కంపెనీలకు చెందిన టీ ఫౌడర్లే టార్గెట్‌గా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అచ్చం ఆ బ్రాండెడ్ టీ ఫౌడర్ల మాదిరిగా బాక్స్‌లు తయారు చేసి, నకిలీ టీ ఫౌడర్లను విక్రియస్తున్నారు. చూడటానికి లోగోలు, ప్యాకింగ్ స్టయిల్ అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. రేటు కూడా సేమ్ ఉంటుంది. పై తగ్గేదే లేదు. కానీ, ప్యాక్ ఓపెన్ చేస్తే మాత్రం అందులోని సరుకు వందకు వందశాతం కల్తీదే ఉంటుంది. తాజాగా సత్తెనపల్లిలో ఈ నకిలీ టీ ఫౌడర్ వ్యవహారం బయటపడింది. అయితే, బ్రాండెడ్ టీ అని తీసుకెళ్తే టేస్ట్‌లో తేడా ఉండటాన్ని గ్రహించిన కొందరు.. నకిలీ టీఫౌడర్ విక్రయిస్తున్నట్లుగా అనుమానించారు. వెంటనే విజిలెన్స్‌ అధికారులకు సమాచారం అందించారు.

ఈ నకిలీ టీ ఫౌడర్‌పై సమాచారం అందుకున్న విజిలెన్స్ అధికారులు.. సడెన్‌గా వచ్చి తనిఖీలు చేశారు. సత్తెనపల్లిలో పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు అధికారులు. ఓ కిరాణా దుకాణంలో ఉన్న టీ ఫౌడర్లను పరిశీలించారు. అవి నకిలీవని, బ్రాండెడ్ బాక్సుల్లో ఉన్న టీ ఫౌడర్లు పక్కా కల్తీ చేసినవని గుర్తించారు అధికారులు. వెంటనే వాటన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇదంతా సత్తెనపల్లికే పరిమితమైందా? ఏపీ అంతటా ఉందా? లేదంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ముఠా నడుస్తోందా? అనేది అనుమానంగా మారింది. తాజాగా ఘటనతో బ్రాండెడ్ టీ ఫౌడర్లను కొనుగోలు చేయాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..