కడప, సెప్టెంబర్ 26: గత నాలుగు రోజులుగా కురుస్తున్న వానల కారణంగా కమలాపురం నియోజకవర్గంలో ప్రవహించే పాపాగ్ని నది పొంగిపొర్లుతోంది. గాంధీ కమలాపురం సమీపంలో జాతీయ రహదారి పై వరద నీరు పొంగి ప్రవహించడంతో భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా చెన్నై , తిరుపతి వెళ్లే వాహనాలకు అలానే తాడిపత్రి, బళ్లారి వెళ్లే వాహనాలకు అంతరాయం కలిగింది.
రేణిగుంట నుంచి తాడిపత్రి వెళ్లే జాతీయ రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి. కడప జిల్లాలోని కమలాపురం సమీపంలో ఈ జాతీయ రహదారిపై పాపాగ్ని నది పొంగి ప్రవహిస్తుండడంతో భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. గతంలో ఈ జాతీయ రహదారిపై ఉన్న వంతెన కూలిపోవడంతో వంతెనకు సమీపాన అప్రోచ్ రోడ్డును వేసి రాకపోకలను ప్రారంభించిన అధికారులు గత నాలుగు రోజులుగా కురుస్తున్న వానల వలన పాపాగ్ని నది పొంగి పొర్లుతుండడంతో అప్రోచ్ రోడ్డుపై ఈరోజు ఉదయం వరద నీరు ప్రవహిస్తుంది. దానిలో భాగంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా కడప నగరం నుంచి జమ్మలమడుగు వరకు వాహనాలను దారి మళ్లించారు. ముఖ్యంగా కడప మీదగా చెన్నై వెళ్ళే కమర్షియల్ వెహికల్స్ కి కొంత ఇబ్బంది ఏర్పడింది .
కమలాపురం కాకుండా కడపు రావాలంటే దాదాపు 50 కిలో మీటర్లు చుట్టూ తిరిగి రావాలి. ఎర్రగుంట్ల మీదుగా మైదుకూరు, పొద్దుటూరు, జమ్మలమడుగు మీదుగా ముద్దునూరు చేరుకోవాలి. లేదంటే కాజీపేట వరకు వచ్చి మైదకూరు మీదా కూడా వెళ్ళవచ్చు. ముఖ్యంగా అత్యవసర సరకుల రవాణా, పనులకు కడప వచ్చేవారికి చాలా ఇబ్బంది ఉంటుంది. కమలాపురంను ఆనుకొని ఉన్న దుగ్గాయపల్లి, వల్లూరు మండలం, పద్దలేపాకు , చిన్ననాగిరెడ్డి పల్లి గ్రామాల వారు కడపకు రావాలన్నా, వెళ్ళాలన్నా కమలాపురం లేదా మైదుకూరు, పొదదుటూరు మీదగా వెళ్ళాల్సి ఉంటుంది. మామూలుగా కమలాపురం నుంచి కడపకు 30 కి మీ వస్తుంది కాని ఇప్పుడు ఇంకో 50 కి మీ పెరుగుతుంది. ఇవికాదు అంటే ఎక్రగుంట్ల నుంచి వేంపల్లి మీదుగా కడపకు రావచ్చు.
అప్రోచ్ రోడ్డుపై వరద నీరు ప్రవహిస్తుండడంతో భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఇవన్నీ కూడా చెన్నై నుంచి బళ్లారి వెళ్లే వాహనాలు అలాగే బళ్ళారి నుంచి తిరుపతి వచ్చే వాహనాలు ఈ రహదారి గుండా రాకపోకలు చేసుంటాయి. రాకపోకలు నిలిపివేయడంతో ఇప్పుడు కడప నుంచి జమ్మలమడుగు మీదుగా దారి మళ్లింపు ఉంది. భారీ వాహనదారులు కడప నుంచి జమ్మలమడుగు మీదుగా గాని లేదా వేంపల్లి మీదుగా గాని మరల ఈ జాతీయ రహదారిలో కలవచ్చు. అలాగే బళ్లారి నుంచి వచ్చేవాళ్ళు జమ్మలమడుగు మీదుగా కడపకు లేదా వేంపల్లి మీదుగా కడపకు చేరుకొని మరల ఈ జాతీయ రహదారిలో కలిసి వారి గమ్యాలకు చేరవచ్చు. అయితే దీనికి సంబంధించి దాదాపు మరో 50 నుంచి 60 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయవలసి ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.