AP TDP: ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి 160 సీట్లు అంటున్న అచ్చెన్నాయుడు

|

Mar 09, 2022 | 3:03 PM

AP TDP: ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) లో రాజకీయాలు ఎన్నికలతో సంబంధం లేకుండా ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుధ్దం కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా టీడీపీ అధ్యక్షుడు..

AP TDP: ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి 160 సీట్లు అంటున్న అచ్చెన్నాయుడు
Andhra Pradesh Tdp Presiden
Follow us on

AP TDP: ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) లో  రాజకీయాలు ఎన్నికలతో సంబంధం లేకుండా ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుధ్దం కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu).. అధికార వైపీసీ నేతలు చేసిన ఛాలెంజ్ పై స్పందించారు. అధికార పార్టీ చేసిన ఛాలెంజ్ లో భాగంగా ముందస్తు ఎన్నికల కు వెళదామని చెప్పారు. అంతేకాదు ఎన్నికలు ఎపుడు వచ్చినా .. టీటీడీ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీ ప్రభ్యుత్వం పై  తీవ్ర వ్యతిరేకత ఉంది..వ్యతిరేకత పెరిగితే నష్టం జరుగుతుందని.. ముందుస్తుగా ఎన్నికలకు వెళ్లే ఆలోచన ప్రభుత్వం చేస్తుందంటూ అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రజలు కూడా తోందర్లోనే ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నారు..తాము కూడా అదే భావిస్తున్నామని చెప్పారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లినా.. టీడీపీకి ఏపీ ప్రజలు పట్టంకడతారని..  160 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాము ఈ విషయం గుడ్డిగా చెప్పడం లేదని..  రాష్ట్రంలో ఆ పరిస్థితులు అలా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏజెన్సీ లో అక్రమ మైనింగ్ జరుగుతోందని అందరికి తెలుసు.. ఆ ప్రాంతాలకు తాము కూడా వెళ్ళామని అచ్చెన్నాయుడు చెప్పారు.  మావోయిస్టులు లేఖ వెనుక టీడీపీ ఉందని అంటారు. బాధ్యత ఉంది కనుక మావోయిస్టులు ప్రకటన చేశారు.. దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ప్రతి దానికీ టీడీపీ ఉందని ప్రభుత్వానికి చెప్పడం అలవాటు అయ్యిందని అన్నారు. చివరికి భార్యా భర్తలు సంసారం చేసుకోకపోయినా చంద్రబాబు కారణమని.. వైసీపీ నేతలు మాట్లాడతారంటూ వ్యాఖ్యానించారు.

Also Read:

అమ్మ ప్రేమ, త్యాగాన్ని తెలియజేస్తూ… మనస్సును కదిలించే ఆదిశంకరాచార్య మాతృ పంచకం

 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర ట్వీట్స్.. ఏమన్నారంటే..