- Telugu News Andhra Pradesh News Andhra pradesh state government adviser sajjala ramakrishnareddy visited the polavaram project photos
Sajjala Visits Polavaram: పోలవరం నిర్మాణం వేగవంతం.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆద్వర్యంలో ప్రాజెక్టుని సందర్శించిన బృందం..
పోలవరం ప్రాజెక్ట్‌లో పనుల తీరును తెలుసుకున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయనతోపాటు విప్‌ల బృందం ప్రాజెక్ట్‌ను పరిశీలించింది.
Updated on: Jun 30, 2021 | 6:26 PM

Polavaram

గోదావరిలో సహజంగా ప్రవహించే నీరు.. బ్యారేజ్ నుంచి డెల్టాకు చేరుతుంది. అయితే పోలవరం పూర్తయిన తర్వాత స్పిల్‌వే, రివర్ స్లూయిజ్, పవర్ హౌస్ డిశ్చార్జ్‌ల ద్వారా బ్యారేజ్ నుంచి కాల్వలకు చేరుతుంది. పోలవరం ఇప్పటికైతే నిర్మాణంలో ఉన్నప్పటికీ, తొలి ఫలితం అందినట్లయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం, మేఘా ఇంజినీరింగ్ అహర్నిశల శ్రమ.. పోలవరాన్ని మన కళ్లముందు నిలబెట్టాయి. వీటిని బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామృష్ణారెడ్డి పరిశీలించారు.

పోలవరం ప్రాజెక్ట్‌లో పనుల తీరును తెలుసుకున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయనతోపాటు విప్‌ల బృందం ప్రాజెక్ట్‌ను పరిశీలించింది. హిల్ వ్యూ నుంచి స్పిల్‌వే దగ్గర వరద పరిస్థితిని చూశారు సజ్జల. గోదావరి వరద ప్రవాహ మళ్లింపును వివరించారు ప్రాజెక్ట్ అధికారులు.

చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డితోపాటు విప్‌లు కొరుముట్ల శ్రీనివాస్, సామినేని ఉదయభాను, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు.


అనుకున్న సమయానికే పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు సజ్జల. ప్రాజెక్ట్ సైట్ దగ్గరకు వెళ్లి పనులను పరిశీలించారు ప్రభుత్వ సలహాదారు. భూనిర్వాసితులకు పూర్తిస్థాయిలో పునరావసం కల్పిస్తామని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ పనితీరును పరిశీలించారు. ఆయనతోపాటు విప్‌ల బృందం ప్రాజెక్ట్‌ను పరిశీలించింది

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలవరం ప్రాజెక్ట్ పనితీరును పరిశీలించారు. ఆయనతోపాటు విప్‌ల బృందం ప్రాజెక్ట్‌ను పరిశీలించింది





























