దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాకాలం ముగిసినా.. ఇంకా దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. తుఫాన్‌ల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. తుఫాను వచ్చే సమయాలతో పాటు పిడుగులు పడే సమయాలను కూడా వెల్లడిస్తూ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది. ముందస్తు జాగ్రత్తల వల్ల నష్టం జరుగకుండా ఉండవచ్చని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథార్టీ సూచిస్తోంది. ఏదైనా అత్యవసర పరిస్థితుల కోసం పోలీసు శాఖ 100కు డయాల్ చేయాలని సూచించింది. ఇక ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. తుఫానుకు ముందు తుఫాను తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఉన్నాయి.
☛ పుకార్లను నమ్మవద్దు. టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు.
☛ అత్యవసర కమ్యూనికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్‌లలో ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి.
☛ తుఫాన్‌ల గురించి వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ ఉండాలి.
☛ మీ సర్టిఫికేట్స్ గానీ, ఇతర పత్రాలు, విలువైన వస్తువులను వాటర్ ఫ్రూప్ కవర్లలో ఉంచుకోండి.
☛ మీ ఇంటిని ముఖ్యంగా పైకప్పు ఏమైనా మరమ్మతులు ఉన్నట్లయితే వెంటనే చేయడం మంచిది. పదునైనా వస్తువులను వదులుగా ఉంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి.
☛ మీ ఇల్లు సురక్షితం కాకపోతే తుఫాను రాకముందే ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిది.
☛ తలుపులు, కిటికీలు మూసి ఉంచండి.
☛ తుఫాను గురించి న్యూస్ ఛానెల్స్, వార్త పత్రికల్లో అధికారికంగా ప్రకటన వచ్చే వరకు బయటకు వెళ్లకపోవడం మంచిది.
☛ ఎలక్ట్రికల్ ఉపకరణాలు, గ్యాస్ కనెక్షన్‌లను తీసివేయండి.
☛ తుఫాన్ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.
☛ మొబైల్ ఫోన్‌ను అత్యవసర సమయంలో కమ్యూనికేషన్‌కు ఛార్జ్ చేసి ఉంచండి. మొబైల్‌కు వచ్చే ఎస్‌ఎంఎస్‌లను చూస్తుండాలి.
తుఫాను ముందు , తుఫాను సమయంలో మరియు తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా తెలుసుకోవడంతో విపత్తు సంభవించినప్పుడు నష్టాల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. #cycloneawareness @APPOLICE100 @IPR_AP pic.twitter.com/pJmTMFYc1m
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 21, 2022
ఇలా భారీ వర్షాల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది. తుఫాన్ల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. తుఫాను ముందు , తుఫాను సమయంలో, తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా తెలుసుకోవడంతో విపత్తు సంభవించినప్పుడు నష్టాల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి