AP Rain Alert: ఏపీలో దంచికొడుతున్న వర్షాలు.. విపత్తుల నిర్వహణ శాఖ కీలక ప్రకటన
Andhra Pradesh Weather Alert:ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
Andhra Pradesh Rain Alert: ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలకు వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ముంపు ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ(APSDMA) కీలక ప్రకటన విడుదల చేసింది. వాయువ్య మరియు పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం నెలకొన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు(సోమ, మంగళవారాలు) ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హెచ్చరించింది. అలాగే కోస్తాంధ్రలోని మిగిలిన చోట్ల మోస్తారు నుంచి తేలికపాటి జల్లులు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.
అలాగే అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీచే అవకాశముంది. రేపటి వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదుని విపత్తులశాఖ కమిషనర్ కె.కన్నబాబు ఆదేశించారు.
Also Read..
Crime News: హైవేపై సినీ ఫక్కీలో దారి దోపిడీ.. దర్యాప్తులో నిజాలు తెలిసి ఫాక్‌కు గురైన పోలీసులు
Army Jawan: డ్యూటీకి బయలుదేరిన ఆర్మీ జవాన్ అదృశ్యం.. మిస్టరీగా మారిన నవీన్ కుమార్ మిస్సింగ్ కేసు..!