GSDPలో దూసుకుపోతున్న ఏపీ.. దేశంలోనే నంబర్‌వన్ ప్లేస్‌.. తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందంటే..?

|

Aug 25, 2022 | 7:52 AM

2021-22 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో ఆంధ్రప్రదేశ్‌ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి 11.43శాతానికి పెరిగి టోటల్‌ ఇండియాలోనే టాప్‌ ప్లేస్‌ సొంతం చేసుకుంది.

GSDPలో దూసుకుపోతున్న ఏపీ.. దేశంలోనే నంబర్‌వన్ ప్లేస్‌.. తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందంటే..?
Ys Jagan
Follow us on

Andhra Pradesh GSDP: ఆంధ్రప్రదేశ్‌ మరో ఘనత సాధించింది. GSDPలోనే ఇండియాలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌లో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు చేరింది. 2021-22 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో ఆంధ్రప్రదేశ్‌ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి 11.43శాతానికి పెరిగి టోటల్‌ ఇండియాలోనే టాప్‌ ప్లేస్‌ సొంతం చేసుకుంది. GSDPలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌వన్‌గా నిలవడంపై సంతోషం వ్యక్తంచేశారు సీఎం జగన్‌. దేశ సగటు 8.7శాతం ఉంటే ఏపీ మాత్రం 11.43శాతం సాధించి టాప్‌లో నిలిచిందని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలిపారు.

దేశ సగటు కంటే, ఆంధ్రప్రదేశ్‌ వృద్ధి రేటు ఎక్కువగా ఉండటం గొప్ప విజయం సీఎం జగన్‌ హర్షం వ్యక్తంచేశారు. దీనికి, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న పారదర్శక విధానాలే కారణమన్నారు. స్కూల్స్‌, హాస్పిటల్స్ డెవలప్‌ కోసం చేపట్టిన నాడు-నాడు, వెల్ఫేర్‌ స్కీమ్‌ వల్లే ఇది సాధ్యమైందన్నారు జగన్‌. ఇక, ఇండస్ట్రియల్‌ సెక్టార్‌లో 12.78శాతం వృద్ధి రేటు సాధించడం కూడా గ్రేట్‌ అఛీవ్‌మెంట్‌ అన్నారు. MSME సెక్టార్‌ కూడా ఎకానమీ గ్రోత్‌కు దోహదపడిందని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు.

GSDP (స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి) లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలవగా.. ఆ తర్వాత, 11.43 శాతం వృద్ధి రేటుతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉండగా, 10.48 శాతం వృద్ధి రేటుతో బీహార్ మూడో స్థానంలో ఉంది. తెలంగాణ 10.88 శాతం వృద్ధి రేటుతో నాలుగో స్థానంలో నిలిచింది.
గత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు కంటే ఏపీ 11.43 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. దేశ జీడీపీ వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..