Cyclone Jawad:తుపాన్ హెచ్చరికల నేపధ్యంలో రైల్వేశాఖ అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు.. వివరాల్లోకి వెళ్తే..

|

Dec 04, 2021 | 11:36 AM

Cyclone Jawad: ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలకు జోవాద్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందస్తు చేపట్టారు. జోవాద్ తుఫాన్ కారణంగా...

Cyclone Jawad:తుపాన్ హెచ్చరికల నేపధ్యంలో రైల్వేశాఖ అప్రమత్తం.. పలు రైళ్లు రద్దు.. వివరాల్లోకి వెళ్తే..
Follow us on

Cyclone Jawad: ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలకు జోవాద్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందస్తు చేపట్టారు. జోవాద్ తుఫాన్ కారణంగా దక్షిణ మధ్య, ఈస్ట్ కోస్ట్ రైల్వే 120 రైళ్లను రద్దు చేసింది. ఇక విశాఖ పట్నంలో కూడా జోవాద్ తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ పరిధిలో 122 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. హౌరా, చెన్నై, భువనేశ్వర్, బెంగుళూర్ ప్రాంతాల మీదుగా వెళ్ళే పలు రైళ్ళను రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ రైల్వే మేనేజర్ అనూప్ సత్పతి చెప్పారు.

జోవాద్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైల్వేపరంగా అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. ఎన్డీఆర్ ఎఫ్ తో పాటు సహాయక బృందాలతో సమన్వయంతో ఉన్నామం ని చెప్పారు. అంతేకాదు తుఫాన్ రిలీఫ్ ట్రైన్స్, మెడిమల్ ఎక్యూప్ మెంట్ సిధ్ధం చేశామని చెప్పారు. రిలీఫ్ స్టాఫ్ తో అలర్ట్ గా ఉన్నామని వాల్తేర్ డివిజన్ రైల్వే మేనేజర్ అనూప్ చెప్పారు. మరోవైపు జోవాద్ తుఫాన్ రేపు ఓడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులుతెలిపారు. తుఫాన్ ప్రభావముతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లలో వర్షాలు మొదలయ్యాయి.

Also Read:  పిచ్చి మొక్క అని పట్టించుకోని.. ఈ చెట్టు ఆకులు మోకాళ్ళ నొప్పికి దివ్య ఔషధం..