AP Govt Nutrition Kit: అంగన్‌వాడీల్లో పంపిణీ చేస్తున్న పౌష్టికాహారంలో పాము కళేబరం..

| Edited By: Ram Naramaneni

Oct 12, 2023 | 9:49 PM

పసి పిల్లలు, బాలింతలు, గర్భిణులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో జగన్‌ సర్కార్ పౌష్టికాహారం సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లలు ఆరోగ్యానికి పౌష్ఠిక ఆహారం చాల అవసరంమని, ఎదిగే పిల్లల్లో పౌష్ఠిక ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఏపీ సర్కార్‌ వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కిట్‌ను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తోంది. అలాగే తల్లి గర్భంలో ఉన్న శిశువుకు కూడా పౌష్ఠిక ఆహారం అందించాలని, అప్పుడే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందనే లక్ష్యంతో గర్భిణులకు..

AP Govt Nutrition Kit: అంగన్‌వాడీల్లో పంపిణీ చేస్తున్న పౌష్టికాహారంలో పాము కళేబరం..
snake carcass inside YSR Sampoorna Poshana nutrition kit
Follow us on

చిత్తూరు, అక్టోబర్‌ 11: పసి పిల్లలు, బాలింతలు, గర్భిణులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో జగన్‌ సర్కార్ పౌష్టికాహారం సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. పిల్లలు ఆరోగ్యానికి పౌష్ఠిక ఆహారం చాల అవసరంమని, ఎదిగే పిల్లల్లో పౌష్ఠిక ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఏపీ సర్కార్‌ వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కిట్‌ను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తోంది. అలాగే తల్లి గర్భంలో ఉన్న శిశువుకు కూడా పౌష్ఠిక ఆహారం అందించాలని, అప్పుడే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందనే లక్ష్యంతో గర్భిణులకు కూడా ఈ పథకం కింద పౌష్టికాహారం అందిస్తోంది.

ఏపీ సర్కార్‌ శిశు సంరక్షణ పథకం కింద రాష్ట్రంలోని అన్ని అంగనవాడి కేంద్రాలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తోంది కూడా. అయితే తాజాగా ఓ గర్భిణీ మహిళకు స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో పంపిణీ చేసిన పౌష్టికాహారంలో ఏకంగా పాము కళేబరం కనిపించింది. దీంతో ఈ వ్యవహారం కాస్తా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం లేపుతోంది. పలువురు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అసలేం జరిగిందంటే..

చిత్తూరు జిల్లాలో బంగారుపాళ్యం మండలం శాంతినగర్ అంగన్‌వాడీ కేంద్రంలో మానస అనే బాలింతకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. ఆమె ఇంటికి వెళ్లి పౌష్టికాహారం ప్యాకెట్‌ను విప్పి చూస్తే అందులో పాము కనిపించడంతో గర్భిణి ఒక్కసారి షాక్‌కు గురైంది. దీంతో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సాయంతో సీడీపీఓకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై స్పందించిన సీడీపీఓ ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పౌష్టికాహారం ప్యాకెట్‌లో పాము కళేబరం వచ్చిన ఘటనపై అధికారులు విచారణ జరుపుతామన్నారు.

ఇవి కూడా చదవండి

అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చే పౌష్టికాహారంలో పాము కళేబరం కలకలం లేపడంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి ఆహారం తింటే గర్భిణీ స్త్రీల పరిస్థితి ఏంటనీ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పంపిణి చేసే పౌష్ఠిక ఆహారం నిజంగానే నాణ్యతగా ఉంటుందా? అనే సందేహం కూడా కొందరికి కలుగుతోంది. ప్రభుత్వం ఇచ్చే పౌష్ఠిక ఆహారం ఆరోగ్యానికి మంచిదేనా? అని కూడా ఆరా తీస్తున్నారు. ఇటువంటి ఆహారం తెలియక తింటే మాపరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా అవుతుందేమోనని వాపోతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.