Andhra Pradesh: ప్రభుత్వ కార్యాలయాలకు ‘విద్యుత్’ షాక్.. బిల్లు కట్టకపోతే అంతమరి అంటూ..

|

Aug 06, 2022 | 7:43 PM

Andhra Pradesh: ఒంగోలులో ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్‌ శాఖ అధికారులు షాక్‌ ఇచ్చారు. నెలల తరబడి విద్యుత్‌ బిల్లులు కట్టకుండా నిర్లక్ష్యం చేసిన..

Andhra Pradesh: ప్రభుత్వ కార్యాలయాలకు ‘విద్యుత్’ షాక్.. బిల్లు కట్టకపోతే అంతమరి అంటూ..
Power Supply Wires
Follow us on

Andhra Pradesh: ఒంగోలులో ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్‌ శాఖ అధికారులు షాక్‌ ఇచ్చారు. నెలల తరబడి విద్యుత్‌ బిల్లులు కట్టకుండా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ కార్యాలయాలకు కరెంట్‌ కట్‌ చేశారు.ఏపీ విద్యుత్‌ రెగ్యులేటరీ కమిటీ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్‌ 10వ తేదీ లోపు విద్యుత్‌ బకాయిలు చెల్లిస్తే.. సర్‌చార్జి మినహాయిస్తామని నెలరోజుల నుంచి నోటీసులు జారీ చేసి మరీ చెబుతున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన విద్యుత్‌ శాఖ అధికారులు తమ పవర్‌ కట్‌ టూల్స్‌తో రంగంలోకి దిగిపోయారు. జిల్లా వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు బకాయిలు పడ్డాయో లేక్కలు తేల్చారు.

ప్రకాశం జిల్లాలో మొత్తం 392 కోట్ల రూపాయలు.. ప్రభుత్వ కార్యాలయాలు బకాయిలు పడ్డాయి. అత్యధికంగా RWS ఆఫీస్.. 112 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖ 90 కోట్లు, ఇరిగేషన్‌ శాఖ 100 కోట్లు, మున్సిపాలిటీలు 13 కోట్లు, విద్యాశాఖ 7 కోట్లు చెల్లించాల్సి ఉందని విద్యుత్ శాఖ చెప్తోంది.

ఈ కార్యాలయాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినా ఎలాంటి స్పందన రాలేదు. చేసేదేమీ లేక పవర్ కట్ చేశారు విద్యుత్ శాఖ అధికారులు. తహసీల్దార్‌ కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలకు కరెంట్‌ సరఫరా నిలిపివేశారు. విద్యుత్‌ సిబ్బంది ఫీజులు ఎత్తుకెళ్ళారు. చీకటి గదుల్లో, ఉక్కపోతకు పనిచేయలేకు సిబ్బంది అల్లాడిపోయారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయంలో వెంటనే కలెక్టర్ కలగజేసుకుని విద్యుత్ శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. త్వరలోనే పెండింగ్ బిల్లులు చెల్లించేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి విద్యుత్‌ను పునరుద్దరించామని విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ సత్యనారాయణ తెలిపారు. నెల రోజుల ముందే నోటీసులు ఇచ్చినప్పటికీ.. కొన్ని ఆఫీసులు బడ్జెట్ లేదంటూ సైలెంట్‌గా ఉన్నాయి. మరికొన్ని ఆఫీసులు బిల్లులు పెట్టకుండా నిర్లక్ష్యం వహించాయి. కోట్లలో పేరుకుపోయిన బిల్లుల్ని ఎలా వసూలు చేయాలో అర్ధం కాని స్థితిలో ఉంది విద్యుత్ శాఖ.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..