ఏపీలో కాపు రాజకీయాలు కాక రేపుతున్నాయి. ముద్రగడ వర్సెస్ పవన్‌కల్యాణ్‌గా మారిపోయింది. లేఖాస్త్రాలకు జనసేన నుంచి అదే రేంజ్‌లో కౌంటర్ ఎటాక్ మొదలైంది. పవన్ టార్గెట్‌గా రెండో లేఖ రాసిన వెంటనే కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టింది. లెటర్‌కు లెటర్‌తోనే బదులిచ్చింది జనసేన. ముద్రగడ టార్గెట్‌గా అనేక ప్రశ్నలు సంధిస్తూ సంచలన ఆరోపణలు చేసింది. ఇంతకీ, జనసేన చేసిన ఆ ఆరోపణలేంటి?
పవన్ కల్యాణ్ టార్గెట్‌గా ముద్రగడ సంధిస్తోన్న వరుస లేఖలకు జనసేన నుంచి ఫస్ట్ కౌంటర్ పడింది. 30 ప్రశ్నలతో రెండో లేఖ విడుదల చేశాక ఘాటుగా రియాక్టయ్యారు జనసేన నేతలు. ముద్రగడ మైనస్‌లను వెతికిమరీ బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడికి మద్దతుగా నిలబడటం వెనుక కారణం ఫ్లాట్ రాజకీయాలే నంటూ బయటపెట్టింది జనసేన.
తాడేపల్లిలో 75లక్షల విలువైన ఫ్లాట్ 30లక్షలకే ఎలా వచ్చిందని లేఖలో ప్రశ్నించింది జనసేన. ఈ ఫ్లాట్ కొనడానికి డబ్బులిచ్చింది ద్వారంపూడేనని ఆరోపించారు. ఇక ఫ్లాట్ కొనేందుకు ఆ ఇద్దరు నేతలు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. బినామీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి గృహప్రవేశం చేయలేదా? పిఠాపురం సీటు కోసం వైసీపీతో డీల్ కుదుర్చుకున్నారా అంటూ లేఖలో ప్రశ్నించింది జనసేనపార్టీ.
పవన్‌కు వచ్చిన జనాధారణ చూడలేక, కుట్రపూరితంగా పవన్‌పై కుల రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు జనసేన నేత పంతన్ నానాజీ. మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అమలాపురం నుంచి అందిస్తారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ముద్రగడ లేఖను సమర్థించారు. కాపు కులస్థుల కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తి అన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ముద్రగడ వరుసగా లేఖలు సంధిస్తుండటంతో జనసేన ఆయన మైనస్‌పాయింట్లను బయటకు తీసే పనిలో పడింది. వైసీపీని అధికారంలోకి తేవడానికి ముద్రగడ తెరవెనుక తీవ్రంగా పనిచేస్తున్నారని విమర్శించారు. 2019లో ఉద్యమాన్ని ఎందుకు ఆపేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐతే లేఖల రాజకీయం.. ఇప్పుడు వైసీపీ ఆరోపణలు చేసిన తాడేపల్లిలోని వజ్ర రెసిడెన్సీలోని ఫ్లాట్ 202 చుట్టూ కొనసాగుతున్నాయి.
ఏపీలో కొనసాగుతున్న కాపుల రాజకీయాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టాలని కోరుతున్నారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. మొత్తానికి నోటికి పెద్దగా పని చెప్పకుండానే పొలిటికల్ హీట్ లేపుతున్నారు కాపునేతలు . మరి, ఈ లెటర్ వార్ ఇంతటితో ఆగుతుందా? లేక మరిన్ని లేఖలతో టాప్ లేపుతారా?. జనసేన ఆరోపణలకు ముద్రగడ కౌంటర్ ఇస్తారా? వేచి చూడాలి మరి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..